పీరియడ్స్ తో మహిళ..వాష్ రూమ్ కు అనుమతించని థియేటర్ సిబ్బంది

నార్త్ కోల్ కతాలో దారుణం జరిగింది. నెలసరితో బాధపడుతున్న మహిళను ఓ సినిమాల్ లోని బాత్రూం ను వినియోగించుకునేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నార్త్ కోల్ కతాలోని హటిబగాన్ కు చెందిన ఓ ప్రముఖ థియేటర్ లో సినిమా చూసేందుకు భార్యభర్తలు వచ్చారు. సినిమా ఇంటర్వెల్ సందర్భంగా నెలసరితో బాధపడుతున్న భార్య థియేటర్ లో బాత్రూం ను వినియోగించుకునేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన సిబ్బంది అందుకు ఒప్పుకోలేదు. నెలసరితో బాత్రూం ను పాడు చేస్తున్నారంటూ నానా మాటలన్నారు. అయితే థియేటర్ సిబ్బంది వాలకం పై ఆగ్రహం వ్యక్తం చేసిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   

Latest Updates