లాక్ డౌన్ తో ఫిట్ గా ఉండాలంటే

ఫిట్‌‌గా ఉండేందుకు ఒక్కొక్కరుఒక్కో దారి ఎంచుకుంటారు. కొంద‌రురోజూ ఉద‌యం వాకింగ్‌‌కు,జాగింగ్‌‌కి వెళ్తే.. ఇంకొంద‌రు జిమ్‌‌,యోగా సెంట‌ర్లకు వెళ్తారు.కానీప్రస్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నిరోజుల పాటు లాక్‌ డౌన్ ప్రకటించాయి. ‌.అంటే ఎవ‌రూ బ‌య‌టికి వెళ్లకుండా, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. మ‌రి ఇలాంటి టైమ్‌‌లోవాకింగ్‌‌కి,జిమ్‌‌ల‌కువెళ్లడం క‌ష్టమే క‌దా.అందుకే ఇంట్లోనే  ఉంటూ ఒంట్లోని క్యాల‌రీల‌ను క‌రిగించొచ్చు. ఇంట్లోనే ఉండ‌టం వ‌ల్లన‌ చ్చిందితింటూ,కుదిరిన‌ప్పుడు ప‌డుకుంటూ ఉంటే బాడీ ఫిట్‌‌నెస్ త‌గ్గు తుంది.అలాగని పెద్దపెద్ద ఎక్సర్ సైజులు  ,యోగాస‌నాలు వేయాల్సిన ప‌ని లేదు. వ‌ర్కవుట్స్ అల‌వాటు ఉన్నవాళ్లైనా,లేని వాళ్లైనా..ఈ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తూ ఫిట్‌‌గాఉండొచ్చు.

స్మార్ట్‌ఫోన్ వాకింగ్ :

స్మార్ట్ ఫోన్ లు  వచ్చిన దగ్గరి నుంచి చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరి చేతిలో ఫోన్ తప్పనిసరిగా ఉంటోంది. వేళ‌‌కు తిన్నా తిన‌‌కున్నాఫోన్వాడటం మాత్రం మ‌‌ర్చిపోవట్లేదు.అంతలా  మనిషిఅలవాటు పడ్డ స్మార్ట్ ఫోన్ ని ఫిట్‌నెస్‌‌ కు ఉపయోగించొచ్చు.అదెలాగంటారా..? ప్రస్తుతం ఆఫీసులు,కాలేజీలకు సెలవు కావడం వల్ల చాలామంది ఫోన్‌‌కాల్స్‌ లోనే బిజీగా ఉంటున్నారు.ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌తో మాట్లాడుతూ ఉంటున్నారు.అయితే ఒకే చోట కూర్చుని మాట్లాడకుండా,ఫోన్ మాట్లాడుతున్నంత సేపు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే బాడీయాక్టివ్‌‌గా ఉంటుంది. కాలింగ్ తోనే కాదు , చాటింగ్ (మెసేజింగ్‌‌) చేసేటప్పుడైనా సరే అటూ ఇటూ తిరుగుతూ చేయొచ్చు. ఇలా రోజులో కనీసం నాలుగైదు గంటలపాటు తిరుగుతూ ఉండొచ్చు.

ఇంటిపనులు: ఇంట్లో చేసేకొన్ని ప‌‌నుల‌‌ను ఫ్యాట్ బ‌‌ర్నింగ్ యాక్విటీస్‌టి గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇల్లు ఊడవటం, తడిబట్టతోతుడవటం, ఇల్లు దులపటం, ఫర్నీచర్ ను శుభ్రం చేయడంద్వారా  బాడీని యాక్టివ్‌‌ గా ఉంచుతాయి. ఇవ‌‌న్నీ చేస్తే ట్రెడ్‌‌ మిల్ మీద ఇరవై నిమిషాలు పరిగెత్తడంతో సమానమని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అందుకే ఆఫీసుల‌‌కు వెళ్లేటప్పుడు వీటికి అంతటైమ్ దొరకదు కాబట్టి.. ఇలాంటి ఫ్రీ టైమ్‌‌లో చేస్తే ఇంటిపని,ఒంటిపని రెండూ ఒకేసారి పూర్తవుతాయి.

పిల్లలతో కలిసి ఆడాలి.. ఇంట్లో చిన్న పిల్లలుంటే మరొక అడ్వాంటేజ్ఉంది. పని అంతా పూర్తయ్యాక కాసేపుఆ పిల్లలతో ఆడుకోవచ్చు. ఒకే చోట ఆడుకునే ఆట కాకుండా, పిల్లలతో కలిసి న‌‌చ్చినపాటలు పెట్టుకుని డాన్స్ చేయెచ్చు.  దాగుడు మూతలులాంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఇంట్లో ఎక్కువఖాళీ ప్లేస్ ఉంటే.. క్రికెట్‌‌, ఫుట్ బాల్ కూడా ఆడొచ్చు. అయితే ఇంట్లోని ముగ్గురు, నలుగురే ఆడాలి తప్ప చుట్టు పక్కన వాళ్లని పిలిచి మ‌‌ళ్లీ సోషల్ డిస్టెన్స్ ను దూరం చేయెద్దు .

ఇంటి యోగ –  రోజూ టీవీల్లో,వాట్సాప్‌లో వ‌‌చ్చే కరోనా వార్తలు చూస్తూ జనం టెన్ష న్‌‌కు లోనవుతున్నారు. ఎవ‌‌రింట్లో వాళ్లుఉన్నా కరోనా బాధితులు, మరణాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ భ‌‌యాందోళన‌‌కు గురవుతున్నారు. ఇలాంటి టైమ్‌‌లో యోగ,ధ్యానం తప్పనిసరి. ‌‌ అందుకే రోజూ ఇంట్లోనే కొంతసేపు ధ్యానం చేయాలి.అప్పుడు మన‌‌సు ప్రశాంతంగా మారుతుంది. తెలిసిన, చిన్నచిన్న యోగాస‌‌నాలు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ యోగ,ధ్యానం మనిషిని శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనితోపాటు టీవీ చూసే టైమ్ తగ్గించుకుంటే మరీ మంచిది.

స్టెయిర్ వ‌‌ర్కవుట్ –  ఈటైమ్‌‌లో జిమ్‌‌కి వెళ్లలేరు  కాబ‌‌ట్టి కార్డియోర్డి ఎక్సర్‌‌ సైజుల‌‌కు దూరమవుతారు. అలాంటప్పుడు ఇంట్లో ఉండే మెట్లను ఉపయోగించుకోవచ్చు.రోజులో మూడు నాలుగు సార్లు పది నిమిషాలు మెట్లు ఎక్కుతూదిగుతూ ఉండాలి.ఈ వర్కవుట్ బాగాపని చేస్తుందని నిపుణులు కూడా చెప్తుంటారు. అయితే మెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. జారే ప‌‌దార్థాలు ఏవీమెట్లపై పడకుండా చూసుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న వర్కవుట్స్ చేస్తూ, ఇంట్లో ఉన్నన్ని రోజులు ఫిట్‌గా ఉండొచ్చ

 

 

 

 

Latest Updates