ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ పై అనుమానాలు…! ఎందుకంటే..?

ర‌ష్యా విడుద‌ల చేసిన క‌రోనా వ్యాక్సిన్ సామ‌ర్ధ్యాల‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. క‌రోనా వైర‌స్ తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న స‌మ‌యంలో ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్ ను విడుద‌ల చేసింది. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పుత్నిక్ పేరుతో వ్యాక్సిన్ ను విడుద‌ల చేశారు. తొలిటీకా త‌న కుమార్తెకు ఇచ్చిన‌ట్లు, ఆమెలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే ఈ వ్యాక్సిన్ సామ‌ర్ధ్యాల‌పై ప‌లు అనుమానాలు త‌లెత్తుతున్నాయి. దీనికి తోడు వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ చెప్పిన‌ట్లు ఆరు కంపెనీలు వ్యాక్సిన్ కోసం విసృతంగా ప‌నిచేస్తున్నాయ‌ని, హ్యూమ‌న్ పై ప్ర‌యోగాలు జ‌ర‌పాల్సి ఉంద‌న్నారు. ఆ ఆరుకంపెనీల్లో రష్యాకు చెందిన స్పుత్నిక్ త‌యారు చేసిన కంపెనీలేదు.

భ‌ద్ర‌త విష‌యంలో రాజీ ప‌డొద్దు : వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్

వ్యాక్సిన్ కోసం భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డొద్దంటూ వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ర‌ష్యాను కోరింది. వ్యాక్సిన్ త‌యారీలో అంత‌ర్జాతీయ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని సూచించింది.

ర‌ష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ ఎలా పనిచేస్తుంది..?

నివేదికల ప్రకారం రష్యా డెవ‌ల‌ప్ చేసిన వ్యాక్సిన్ ఒక సాధారణ కోల్డ్ వైరస్ అయిన SARS-Cov-2 కు చెందిన అడెనోవైరస్ యొక్క డీఎన్ఏపై ఆధారపడి ప‌నిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ కొద్ది కొద్ది గా వైర‌స్ ను నాశ‌నం చేసే వ్యాధి కారకాల్ని విడుద‌ల చేస్తుంది. ఆ వ్యాధి కారకాలు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచి..వైర‌స్ ను నాశ‌నం చేస్తాయి.

స్పుత్నిక్ వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవు : గ‌మ‌లేయా డైర‌క్ట‌ర్ 

స్పుత్నిక్ లో వ్య‌క్తికి అనారోగ్యాన్ని క‌లిగించే ల‌క్ష‌ణాలు లేవ‌ని గ‌మ‌లేయా నేష‌న‌ల్ రిసెర్చ్ సెంట‌ర్ డైర‌క్ట‌ర్ అలెగ్జాండ‌ర్ జింట్స్ బ‌ర్గ్ తెలిపారు. కాకపోతే ఈ టీకాలు వేసిన‌ప్పుడు కొంత‌మందిలో జ్వ‌రం మాత్ర‌మే వ‌స్తుంద‌న్నారు.

ర‌ష్యా త‌యారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ పై అనుమానం ఎందుకంటే..?

సైంటిస్ట్ ల అభిప్రాయం ప్ర‌కారం ర‌ష్యా త‌యారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ మూడో ద‌శ మ‌నుషుల‌పై ప్ర‌యోగాలు జ‌ర‌గ‌లేదు. దీనికితోడు వ్యాక్సిన్ ను స్పీడ్ గా డెవ‌ల‌ప్ చేయాల‌ని ర‌ష్యా ప్ర‌భుత్వం సైంటిస్ట్ ల‌పై ఒత్తిడి తెచ్చింది. దీని వ‌ల్ల ఘోరమైన ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

Latest Updates