సినిమాలు, ఇల్లు ఇంకా ఎన్నో : జ్యోతి జీవితాన్ని మార్చేసిన 1200 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ప్రతికూల పరిస్థితుల్లో జ్యోతి చేసిన సాహసం ఇప్పుడు ఆమెకు వరంగా మారింది. పరిస్థితులు ఎలా ఉన్నా సంకల్ప బలం ఉంటే చేయాల్సిన పనిని ఈజీగా చేయోచ్చని నిరూపించిన బీహార్ బాలిక మరోసారి హాట్ టాపిగ్గా మారింది.

లాక్ డౌన్ లో మే నెలలో  గాయపడిన తన తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్ కు 1,200 కిలోమీటర్లు సైకిల్‌పై స్వగ్రామానికి చేర్చిన బాలిక జ్యోతి అందరికి గుర్తుండే ఉంటుంది. అసలే లాక్ డౌన్. రవాణ సౌకర్యం బంద్. దీంతో అనారోగ్యంగా ఉన్న తన తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్ కు సైకిల్ తొక్కుకుంటూ ప్రయాణించిన బాలికకు పెద్ద ఎత్తున అభినందలు వెల్లువెత్తాయి. సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జ్యోతికి సైక్లింగ్‌లో శిక్షణతో పాటు ఆమె చదువుకు కూడా సహాయం అందిస్తామని ఆఫర్ చేసింది.

అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంకా సైతం ఆమె సాహసంపై స్పందించారు.  భారతీయుల ఆత్మస్థైర్యం, ప్రేమాభిమానాలను కొనియాడారు.  మ్యాథమెటీషియన్‌, సూపర్‌ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ ఆమెను అభినందించారు. ఆనంద్ కుమార్ తరపున ఆయన తమ్ముడు ప్రణవ్.., జ్యోతి కుటుంబాన్ని కలిసి సహాయం అందించాడు. భవిష్యత్తులో ఐఐటిఎన్‌ కావాలనుకుంటే జ్యోతి కుమారికి తమ సూపర్‌ 30 స్వాగతం పలుకుతుంది అంటూ ఆనంద్‌ కుమార్‌ ట్వీట్‌ లో పేర్కొన్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో ఆమె చేసిన సాహసం తొలత ఎవరూ నమ్మలేదు. కానీ ఆమె తన తండ్రిని సైకిల్ పై కూర్చొపెట్టుకొని సైకిల్ తొక్కిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఇలా జ్యోతికి తమవంతు ఆర్థిక సాయం అందించారు.

తాజాగా ఆమె పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లాక్ డౌన్ కు ముందు కుటుంబం ఆర్ధిక సమస్యలతో చిన్నాభిన్నమైంది. కనీసం ఉండడానికి నిలువనీడలేక తీవ్రం ఇబ్బందులకు గురైంది. కానీ ఇప్పుడు జ్యోతి తన స్వగ్రామం బీహార్ లో నాలుగు గదుల ఇంటిని నిర్మించుకుంది. ఇద్దరు నిర్మాతలు ఆమె సాహసంపై సినిమా చేసేందుకు ఒప్పొందం కుదుర్చుకున్నారు. ఒక నిర్మాత సినిమా తీసేందుకు అడ్వాన్స్ ముందే చెల్లించారు. ఇక దేశ వ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు ఇలా మొత్తం 2లక్షలకు పైగా ఆర్ధిక సాయం అందించారు. ఇలా అవకాశాలు జ్యోతిని వరించాయి. భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తానని ధీమాగా చెబుతుంది. ఆల్ ది బెస్ట్ జ్యోతి.

 

Latest Updates