VIP భద్రత: ఏ కేటగిరీలో ఎంతమంది పోలీసులుంటారంటే..

ఎక్స్​.. వై.. జెడ్​.. జెడ్​+.. ఎస్పీజీ..

ఇవన్నీ ఇంగ్లిష్​ అక్షరాలు కావు. వీఐపీలకు, వీవీఐపీలకు సెక్యూరిటీ కల్పించే ఐదు కేటగిరీలు. ఎవరికి ఏ ప్రొటెక్షన్​ ఇవ్వాలనేది ఇంటెలిజెన్స్​ బ్యూరో అందించే ఇన్ఫర్మేషన్​పై ఆధారపడుతుంది.

ఎక్స్​ కేటగిరీ: ఇద్దరు బాడీగార్డులనే కేటాయిస్తారు. వాళ్లు కమాండోలు కాదు. సాయుధ పోలీసు సిబ్బంది మాత్రమే.

వై కేటగిరీ: వీరికి11 మందితో సెక్యూరిటీ కవర్​ లభిస్తుంది. ఇందులో ఒకరు లేదా ఇద్దరు కమాండోలుంటారు. మిగిలినవాళ్లు పోలీసులు.

జెడ్​ కేటగిరీ: దీని పరిధిలోకి వచ్చే వ్యక్తులకు 22 మందితో సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో నలుగురు లేదా ఐదుగురు ఎన్​ఎస్​జీ కమాండోలుంటారు. మిగతావాళ్లు పోలీసులు.

జెడ్​ ప్లస్​ కేటగిరీ: ఈ కేటగిరీ వీఐపీలకు ఏకంగా 55 మందితో ఫుల్​ సెక్యూరిటీ కల్పిస్తారు. ఇందులో 10 మంది ఎన్​ఎస్​జీ కమాండోలు, తతిమ్మావాళ్లు పోలీసులు ఉంటారు. ఇప్పుడు 17 మంది వీఐపీలకే ఈ ప్రొటెక్షన్ ఉంది.

ఎస్పీజీ కేటగిరీ: ఇది అన్నిటికంటే నెంబర్​ వన్​ సెక్యూరిటీ సిస్టమ్​. దీన్ని ఇకపైన దేశంలో ఒకే ఒక వ్యక్తి (ప్రధాని)కి ఇవ్వనున్నారు. ఎస్పీజీలో ప్రస్తుతం 3,000 మంది సిబ్బంది ఉన్నారు.

వీవీఐపీలు, వీఐపీలతోపాటు పొలిటీషియన్లు, హై–ప్రొఫైల్​ సెలబ్రిటీలు, స్పోర్ట్స్​ పర్సన్స్, ఇతర రంగాల్లో పెద్ద పొజిషన్​లో ఉన్నవారికి సెక్యూరిటీ బాధ్యతను 5 ఏజెన్సీలకు అప్పగించారు. అవి.. 1. ఎస్పీజీ 2. ఎన్​ఎస్​జీ 3. ఐటీబీపీ 4. సీఆర్​పీఎఫ్​. 5. సీఐఎస్​ఎఫ్​.

Latest Updates