యాప్స్‌‌తో ప్రైవసీ ఎంత? : యూజర్ల సాలరీ, బిల్లుల వివరాలన్ని యాప్స్ చేతికి..!

అవసరమైన దానికంటే ఎక్కువ డేటా సేకరిస్తోన్న యాప్స్
యూజర్ల సాలరీ, బిల్లుల వివరాలన్ని యాప్స్ చేతికి..
షేర్ చేసే డేటా విషయంలో అవగాహన ఉండాలి
కొత్త ఓఎస్‌‌లను, సాఫ్ట్‌‌వేర్లను అప్‌‌డేట్ చేసుకోవాలి

బిజినెస్ డెస్క్, వెలుగు: ప్రతి ఒక్కరి స్మార్ట్‌‌ఫోన్లలో కనీసం ఒక పది యాప్స్ అయినా ఉండి ఉంటాయి. మెసేజ్ చేసుకోవడానికి, ఫుడ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌కి, క్యాబ్ బుక్ చేసుకోవడానికి ఇలా ప్రతి ఒక్కదానికీ యాప్స్ సాయం తీసుకుంటూనే ఉంటారు. మన లైఫ్స్‌‌‌‌ను యాప్స్ ఎంత సౌకర్యవంతంగా మార్చాయో… అంతకంటే ఎక్కువగానే ప్రమాదంలో కూడా పడేస్తున్నాయి. యాప్స్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్ చేసుకున్న తర్వాత.. ఎలాంటి డేటాను ఇవి సేకరిస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలా మంది యూజర్లకు యాప్స్‌‌‌‌ తమకు సంబంధించిన ఏ డేటాను సేకరిస్తున్నాయి? ఎవరికి షేర్ చేస్తున్నాయి? అనే విషయమే తెలియదంట. బ్యాంకింగ్, ఫుడ్ ఆర్డరింగ్, స్టాక్ మార్కెట్, ఈ–కామర్స్, క్యాబ్ హైలింగ్, సోషల్ మీడియా, ఇతర యాప్స్ కావాల్సిన సమాచారం కంటే ఎక్కువ డేటానే సేకరిస్తున్నాయని తేలింది. అవసరమైన దాని కంటే ఎక్కువగా సమాచారం సేకరించడం కాస్త ఆందోళనకరమేనని కన్వర్జేషనల్ ఏఐ ప్లాట్‌‌‌‌ఫామ్ ఓఆర్‌‌‌‌‌‌‌‌ఐ కోఫౌండర్, సీటీఓ అనురాగ్ జైన్ అన్నారు. ఒక ఫేమస్ యాప్ తన దగ్గర్నుంచి టెక్ట్స్ మెసేజ్‌‌‌‌లను యాక్సస్ చేసే పర్మిషన్‌‌‌‌ను పొందిందని, కానీ కొన్ని గంటల తర్వాత తన ఆదాయం, ఖర్చుల విషయాలన్ని యాప్‌‌‌‌కు తెలిసిపోయాయని అన్నారు. అంతేకాక తనకు ఎంత ఇన్సూరెన్స్ కవర్ వస్తుందో కూడా చెప్పేస్తుందని పేర్కొన్నారు. ఇలా యాప్స్  అవి తీసుకునే పర్మిషన్ల ద్వారా యూజర్లకు తెలియకుండానే సమాచారాన్నంతటిన్ని లాగేస్తున్నాయని, వ్యక్తిగత గోప్యతకు హాని కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వాట్సాప్‌‌‌‌ ఇటీవలే యూజర్ల డేటాను తమ పేరెంట్ కంపెనీ ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌తో షేర్ చేసుకుంటామని చెబుతూ అబాసుపాలైంది. మీ ప్రైవేట్ మెసేజ్‌‌‌‌లను చూడమని చెబుతూనే.. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌కు బెటర్ యాడ్స్‌‌‌‌ కోసం యూజర్ల డేటాను అందిస్తామంటోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు పెద్ద ఎత్తునే ఆందోళన చేశారు. వాట్సాప్‌‌‌‌ను డిలీట్ చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవడం ప్రారంభించారు. దీంతో వాట్సాప్ దిగొచ్చింది. చాలా వరకు యాప్స్ టెక్ట్స్ మెసేజ్‌‌‌‌లను, కాల్స్ డేటాను, లొకేషన్‌‌‌‌ను, కెమెరాను, ఫోటో లైబ్రరీను యాక్సస్ చేసే పర్మిషన్ అడుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఈ యాక్సస్ కనుక ఇస్తే.. వారి వద్దనున్న సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లు యూజర్ల శాలరీ వివరాలు, క్రెడిట్ కార్డుల బకాయిలు, మెసేజింగ్ ఇన్‌‌‌‌బాక్స్‌‌‌‌లో ఉన్న సమాచారాన్నంతటిన్ని లాగేస్తాయి. అంతేకాక యూజర్ల ఫోటో లైబ్రరీ అంతా వారి చేతిలో ఉంటుంది. ‘యూజర్లు ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ను యాక్సస్ చేసే పర్మిషన్‌‌‌‌ను కనుక ఇస్తే.. ఆ యాప్‌‌‌‌ కేవలం ఓటీపీని మాత్రమే రీడ్ చేయదు. ఆ  యాప్ ప్రతి నెల మీ అకౌంట్‌‌‌‌లో ఎంత శాలరీ పడుతుంది, ఎక్కడ నుంచి ఇన్‌‌‌‌కమ్ వస్తుంది, యూజర్ల ఖర్చులను, ఏ బ్రాండ్లతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనే వివరాలన్నింటిన్ని సేకరిస్తుంది’ అని ఇండస్‌‌‌‌ ఓఎస్ సీఈవో, కోఫౌండర్ రాకేష్ దేశ్‌‌‌‌ముఖ్ చెప్పారు. సౌకర్యవంతమైన సర్వీసులను ఇస్తామని చెబుతూనే.. అవసరమైన దానికంటే ఎక్కువగానే యూజర్ల నుంచి డేటాను యాప్స్ సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది యూజర్లకు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

మీ డేటాను కాపాడుకోవడం ఎలా..?

అన్ని యాప్స్‌‌లో వైరస్‌‌ను ఎప్పడికప్పుడు  చెక్ చేసుకుంటూ ఉండాలి యాప్స్‌‌కు ఎలాంటి పర్మిషన్లు అవసరమో తెలుసుకోవాలి. ఫుడ్ డెలివరీ యాప్‌‌కు మీ కాంటాక్ట్‌‌ లిస్ట్‌‌తో పనేంటి? అనే అవగాహన ఉండాలి. ఇతర యాప్స్‌‌ లేదా టెక్ట్స్ మెసేజ్‌‌ల ద్వారా వచ్చే లింక్స్‌‌ నుంచి యాప్స్‌‌ను అసలు డౌన్‌‌లోడ్ చేసుకోవద్దు. ఎప్పడికప్పుడు ఫోన్ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను అప్‌‌డేట్ చేసుకోవాలి. కొత్త ఓఎస్ వెర్షన్లు మీ యాప్స్ యాక్సస్‌‌ను నిరోధిస్తాయి తక్కువగా తెలిసిన యాప్స్ ద్వారా వీడియో కాల్స్ చేయొద్దు. కాల్ తర్వాత ఆ యాప్స్‌‌ మీ కెమెరాను యాక్సస్ చేసే అవకాశం ఉంది

యూజర్ల డేటాను మోనిటైజ్ చేస్తున్నాయ్!

యాప్స్ కంపెనీలు అవసరమైన దానికంటే ఎక్కువ డేటానే సేకరిస్తున్నాయన్నది నిజమని ఎక్స్‌‌పర్ట్‌‌లు కూడా అంటున్నారు. ఒక బ్యాంక్‌‌కు యూజర్ల లొకేషన్‌‌తో సంబంధం ఏమిటని? ఎందుకు గేమింగ్ యాప్ ఫోటో లైబ్రరీ యాక్సస్‌‌ అడుగుతుందని? ఎక్స్‌‌పర్ట్‌‌లు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా లాంగ్ టర్మ్ బిజినెస్ మోడల్ అని, యూజర్ల డేటాను మోనిటైజ్ చేసుకోవడం కోసం ఇలాంటి పర్మిషన్లను  తీసుకుంటుంటారని అన్నారు. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్లు, యాపిల్ ఐఓఎస్ వంటివి పర్మిషన్లను రిస్ట్రిక్ట్ చేస్తాయని ఎక్స్‌‌పర్ట్‌‌లు పేర్కొంటున్నారు. అందుకే ఎప్పడికప్పుడు యూజర్లు సాఫ్ట్‌‌వేర్లను అప్‌‌డేట్ చేసుకుంటూ.. కొత్త వెర్షన్లను వాడాలని సూచిస్తున్నారు. చాలా యాప్స్‌‌ కూడా డేటాను సేకరించి, వాటిని ఎలా మోనిటైజ్ చేసుకోవాలో తర్వాత ఆలోచిస్తూ ఉంటాయని నోర్టాన్‌‌లైఫ్‌‌లాక్  సేల్స్ అండ్ ఫీల్డ్ మార్కెటింగ్(ఇండియా, సార్క్) డైరెక్టర్ రితేష్ చోప్రా చెప్పారు. మనీ కోసమే యాప్స్ ఇలా చేస్తూ ఉంటాయని, యూజర్లు తమ డేటాను షేర్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. యూజర్లకు తమ డివైజ్ సెట్టింగ్స్ విషయంలో అవగాహన ఉండాలని  టెక్‌‌ఏఆర్‌‌‌‌సీ ఫౌండర్ ఫైసల్ కవుసా అన్నారు. యాప్స్ యాక్సస్‌‌ను కంట్రోల్ చేయాలని పేర్కొన్నారు. చాలా మంది యూజర్లకు ఇది చాలా కష్టమైన పని అని, కానీ  మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో గుర్తించాలన్నారు.

-రితేష్ చోప్రా, డైరెక్టర్, సేల్స్ అండ్ ఫీల్డ్ మార్కెటింగ్(ఇండియా, సార్క్), నోర్టాన్‌‌లైఫ్‌‌లాక్

Latest Updates