ఫైటర్ జెట్ ఎమెర్జెన్సీ ల్యాండింగ్: పార్కింగ్ ద్వారా కేరళ ఎయిర్ పోర్ట్ ఎంత సంపాదిస్తోందంటే ?

ఫైటర్ జెట్ ఎమెర్జెన్సీ ల్యాండింగ్: పార్కింగ్ ద్వారా కేరళ ఎయిర్ పోర్ట్ ఎంత సంపాదిస్తోందంటే ?

వాహనాలు పార్కింగ్ చార్జెస్ చూసాం, వేటింగ్ చార్జెస్ చూసాం కానీ ఎయిర్ పోర్టులో ఇతర దేశల జెట్ విమానాల పార్కింగ్ చార్జెస్ గురించి ఎప్పుడైనా విన్నారా... అవును మన దేశంలో ఇతర దేశ విమానాల ల్యాండింగ్ పై చార్జెస్ విధిస్తుంది. ఇలాంటి చార్జెస్ మన దగ్గరే కాకుండా ఇతర దేశాలలో కూడా ఉంది. అయితే  కేరళలోని తిరువనంతపురంలో సాంకేతిక సమస్యల కారణంగా నెలకు పైగా ఆగిపోయి ఉన్న UKకి చెందిన F-35 ఫైటర్ జెట్ ఎయిర్ పోర్ట్ పార్కింగ్ ఫీజు కడుతున్నట్లు తెలిసింది. విషయం ఏంటంటే జూలై 6న బ్రిటిష్ రాయల్ నేవీ ఫైటర్ జెట్‌ను బ్రిటిష్ ఇంజనీర్లు టెస్ట్ చేయడానికి ఒక ప్రదేశానికి తరలించారు. 

టెస్టింగ్ సమయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ల్యాండింగ్ చేసాక  ఆగిపోయిన బ్రిటిష్ F-35B ఫైటర్ జెట్‌ మళ్ళీ ఎగరలేదు. దింతో దీనిని  చెక్ చేయడానికి బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 24 మందితో ఒక టీం  జూలై 6న తిరువనంతపురం వచ్చింది. అయితే ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ (IDWR) ప్రకారం ఈ బ్రిటిష్ జెట్ పార్కింగ్ ఫీజు ఒక్కరోజుకు రూ. 26,261 అని అంచనా. ఈ అంచనా ప్రకారం, జూన్ 14 నుండి 33 రోజులకు  చూస్తే ఒక్క పార్కింగ్ ఫీజే దాదాపు రూ. 8.6 లక్షలు ఉంటుంది.

14 మంది సాంకేతిక నిపుణులు, 10 మంది సిబ్బందితో ఈ టీం ముందుగా విమానాన్ని ఇక్కడే రిపేర్ చేయవచ్చా లేదా విమానాన్ని భాగాలుగా వేరు చేసి యునైటెడ్ కింగ్‌డమ్‌కు తిరిగి పంపించాల్సి ఉంటుందా అని జెట్ కండిషన్ని అంచనా వేసింది. మొదట్లో ఈ యుద్ధ విమానం తర్వలోనే యునైటెడ్ కింగ్‌డమ్‌కు తిరిగి వెళ్లే అవకాశం ఉందని తెలపగా, గత వారం విమానం UKకి తిరిగి వెళ్లే  ముందు కొన్ని మరమ్మతులు చేయాలని ఇంజనీర్లు చూస్తున్నట్లు పేర్కొంది.

$110 మిలియన్లకు పైగా విలువైన ఈ జెట్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటి. ఈ విమానం కేరళ తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో టెస్టింగ్ నిర్వహిస్తుండగా సాంకేతిక సమస్య కారణంగా జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చివరకు బ్రిటన్ రాయల్ నేవీ యాజమాన్యంలోని F-35B జెట్‌ను రవాణా కోసం విడదీయాల్సి(dismantle) రావచ్చు లేదా C-17 గ్లోబ్‌మాస్టర్ వంటి పెద్ద ప్రత్యేక విమానం ఉపయోగించి తీసుకెళ్లవచ్చు అని తెలిపింది. 

ALSO READ : Market Fall: నష్టాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. అసలు కారణాలు ఇవే..

జెట్ విమాన సమస్యను సరి చేయడానికి భారత వైమానిక దళం అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చింది. అయితే, ఫైటర్ జెట్ క్యారియర్‌ రావడానికి రెడీ ఆతున్నప్పుడు చెకింగ్ సమయంలో హైడ్రాలిక్ ఫెయిల్  అయ్యింది. ఒక చిన్న రాయల్ నేవీ టీం ఈ లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నించిన ఫెయిల్ అయ్యింది. F-35B అనేది తక్కువ దూరంలో షార్ట్ టేకాఫ్ అలాగే  నిలువుగా ల్యాండింగ్ (STOVL) అయ్యే కెపాసిటీ  ఉన్న ఏకైక ఐదవ తరం ఫైటర్ జెట్. ఈ కారణంగా చిన్న రన్‌వేలు, కఠినమైన ప్రదేశాలు, యుద్ధ నౌకల నుండి కూడా ఈజీగా గాల్లోకి ఎగురుతుంది.