సైరా లో షేర్ ఖాన్ పాత్ర కోసం చరణ్ : నో చెప్పిన చిరంజీవి

స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై  మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్  నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, లేడి సూపర్ స్టార్ నయనతార, మిల్క్ బ్యూటీ తమన్నాలు ప్రముఖ పాత్రలు పోషిస్తుడడంతో అభిమానులంతా సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన పాత్ర గురించి మెగాస్టార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సినిమాలో ఇంటర్వెల్ కు ముందు షేర్ ఖాన్ అనే ఒక పాత్ర ఉంటుందని,  ఆ పాత్రను సల్మాన్ ఖాన్ లేదా సంజయ్ దత్ నటించాలని రామ్ చరణ్ కోరాడని తెలిపారు. కాని  యూనిట్ మాత్రం రామ్ చరణ్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని సూచించారన్నారు.

కానీ ఆ క్యారెక్టర్ చరణ్ చేయాలనడం తనకు నచ్చలేదని చిరంజీవి చెప్పారు. ఎందుకంటే ఆ పాత్ర నరసింహ రెడ్డితో పోరాడి, చివరికి నరసింహ రెడ్డి కత్తితోనే తనను తాను చంపుకుంటుంది. “చరణ్ పాత్ర నా చేతిలో చనిపోవడం యాంటీ సెంటిమెంట్ అని భావించాం, కాబట్టి ఆ పాత్రను చరణ్ ని చేయెద్దన్నాం. కానీ తరువాత, సినిమా రన్ టైమ్ ఎక్కువవడంతో ఆ మొత్తం ఎపిసోడ్ ను చిత్రం నుండి తొలగించామని ”చిరంజీవి తెలిపారు.

 

Latest Updates