ఏప్రిల్ నుంచి BS4 వెహికల్స్ పరిస్థితి ఏంటి.?

న్యూఢిల్లీదేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి బీఎస్‌‌‌‌‌‌‌‌–6 వెహికల్స్ మాత్రమే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే బీఎస్‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ రిజిస్ట్రేషన్లను గానీ అమ్మకాలను గానీ అనుమతించరు. బీఎస్‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ కంటే బీఎస్‌‌‌‌‌‌‌‌–6 బండ్లు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ షోరూముల్లో బీఎస్‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ అమ్ముడుపోకుండా పడున్నాయి. కరోనా కేసులు పెరిగాక అయితే షోరూమ్ల వైపు చూసే వాళ్లే కరువయ్యారు. డిస్కౌంట్ల పేరుతో ఊరిస్తున్నా అమ్మకాలు పెరగడం లేదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండటంతో ఇళ్ల నుంచి జనం అసలు బయటికే రావడం లేదు. తాజా లెక్కల ప్రకారం ఇంకా అమ్ముడుకాని బీఎస్‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంటుంది. వీటి విలువ రూ.3,600 కోట్ల దాకా ఉండొచ్చు. వీటన్నింటినీ అమ్మాలంటే డీలర్లకు కనీసం రెండు వారాల వర్కింగ్ డేస్ అవసరం. అంతేగాక డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తేనే అమ్మకాలు సాధ్యమవుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ అమ్మకాలకు అడ్డుగోడగా మారింది. ఇప్పుడు డీలర్లకు ఏం చేయాలో తోచడం లేదు.

కోర్టు పర్మిషన్ ఇస్తుందా ?

బీఎస్‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ ఇన్వెంటరీ అంతటా పేరుకుపోయింది కాబట్టి వీటి రిజిస్ట్రేషన్లకు, అమ్మకాలకు గడువును పొడగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సుప్రీంకోర్టును కోరింది. అయితే కోర్టు ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పిటిషన్లను తిరస్కరించింది. మనదేశంలోనే అతిపెద్ద టూవీలర్ కంపెనీ హీరో మోటో కార్ప్ కూడా బీఎస్‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ రిజిస్ట్రేషన్ల గడువును పొడగించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దీనిపై కోర్టు ఇంకా తీర్పు ప్రకటించలేదు. గడువును పొడగించడానికి కోర్టు ఒప్పుకోకుంటే ఈ నెల 31 తరువాత బీఎస్‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ నిరుపయోగంగా మారుతాయి. ఇండియా మార్కెట్లో వీటిని అమ్మడం సాధ్యం కాదు. దీంతో కంపెనీలన్నీ ఇలాంటి వాహనాలను డీలర్ల నుంచి వెనక్కి తెప్పించుకొవచ్చు. నేపాల్, ఆఫ్రికా వంటి దేశాల్లో వీటిని అమ్ముకునే అవకాశముంది. అయితే వీటిని ఎగుమతి చేయడానికి కంపెనీలకు అదనంగా ఖర్చవుతుంది. పైగా ఈ వెహికల్స్‌‌‌‌కు స్పేర్‌‌‌‌పార్టులనూ అందుబాటులో ఉంచాలి. ఏటా మోడల్స్ అప్‌‌‌‌గ్రేడ్ అవుతుంటాయి కాబట్టి అన్ని మోడల్స్ విడిభాగాలను అందుబాటులో ఉంచడమూ కష్టమే. బీఎస్‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్‌‌‌‌ను బీఎస్‌‌‌‌‌‌‌‌–6 వెహికల్స్‌‌‌‌గా మార్చవచ్చు కానీ చాలా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి.

గ్రోసరిస్ మాత్రమే..నిత్యావసరాలు తప్ప మిగతా ఆర్డర్లు తీసుకోం

Latest Updates