కరోనా వైరస్ ఇంట్లోకి అడుగుపెట్టకుండా ఉండాలంటే

కరోనా… గత కొద్దిరోజులుగా ఎవరి నోట విన్నా ఇ దే మాట. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే ముచ్చట.. ఏ న్యూస్ చానెల్ ఆన్ చేసినా.. ఏ పేపర్ తిరగేసినా అంతా దీన్ని గురించిన వార్తలు..జాగ్రత్తలే. శుభ్రతే వైరస్ కు మందు అంటూ ప్రభుత్వాలు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. దాంతో ప్రజలంతా ఎప్పటికప్పుడు చేతుల్ని, పరిసరాల్ని శుభ్రపరుచుకుంటున్నారు. కానీ క్లీనింగ్ కోసం ఉపయోగించే ఆ ప్రాడక్ట్స్ వైరస్ ను నిజంగా కట్టడి చేయగలవా అంటే…. అనుమానమే. ఏ క్లీనింగ్ ప్రొడక్ట్ ఎంతమేర వైరస్ ను  నిర్మూలించగలదో చూద్దామా!

కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందాలంటే వైరస్ వ్యాపించే అవకాశాలను అడ్డు కోవాలి. ఇందుకోసం తరచుగా చేతులతో పాటు ఇంటిని, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయాలి. ఇందుకోసం ఉపయోగించే ప్రొడక్ట్స్  కూడా వైరస్ కట్టడిచేయగలవై ఉండాలి. మరి మనం తరచూ ఉపయోగించే ఇంటి క్లీనింగ్ పద్ధతులు కరోనా వైరస్ ను  ఎంత మేర తిప్పిగొట్టగలవ్.

సబ్బు నీళ్లు 

సబ్బునీళ్లు చేతులకు వైరస్ సోకితే అది శరీరంలోకి ప్రవేశించకుండా వెంటనే చేతుల్ని శుభ్రపరు చుకుంటే సరిపోతుంది. కానీ ఆ వైరస్ ఇంట్లోని ఉపరితలాలను చేరితే.. అది అక్కడ కొన్ని రోజు లపాటు బతికే ఉంటుంది. అందుకే ఈ వైరస్ ను  చంపడానికి పవర్‌ఫుల్‌ ప్రొడక్స్ వాడాలి.  కానీ, ఇంటి క్లీనింగ్ అంటే సబ్బు నీళకే ఎ్ల క్కువ ఇంపార్టెన్స్ చూపుతారు చాలామంది. సబ్బు నీళ్లు ఇళ్లంతా చల్లి గదుల్ని కడుగుతారు. కానీ ఆ సబ్బునీళ్ల వల్ల వైరస్ ఉపరితలంనుంచి పోతుందే తప్ప చనిపోదు. అందుకే ఈ సమయంలో ఇంటి క్లీనింగ్ కు సబ్బునీళ్లు  ఉపయోగించకపోవడమే మంచిది. కావాలంటే తరచుగా తాకే వీలు ఉండే టేబుళ్లు, తలుపుల గడియలు, నాబ్స్, స్విచ్లు, హ్యాండిల్స్, ఫోన్లు, కీ బోర్డులు, మరుగుదొడ్లు, సింక్లు మొదట సబ్బు నీళతో శుభ్రం చేసిన తర్వత ఇతర క్లీనింగ్ పద్ధతుల్ని ఫాలో అవ్వాలి.

బ్లీచ్ :  బ్లీచ్లోని సోడియం హైపర్ క్లోరైట్  ఇంట్లోని వైరస్ ను  కట్టడి చేయడంలో కీరోల్ ప్లే చేస్తుంది. బ్లీచ్ ను  10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్లోర్ మీద చల్లి గుడ్డతో తుడిస్తే వైరస్ చనిపోతుంది. ఈ పద్ధ తిలో క్లీనింగ్ కోసం ఐదు టేబుల్‌ స్పూన్ల బ్లీచిం గ్ పౌడర్‌ను నాలుగు లీటర్ల నీళ్లలో కలిపి వాడాలి. ఇంట్లోవాడే బ్లీచిం గ్ పౌడర్‌ను అమ్మోని యా లేదా మరే ఇతర క్లీనింగ్‌ పదార్థాలతో కలిపి వాడకూడదు. సర్జికల్ స్పిరిట్ సర్కజిల్ స్పిరిట్లో ఆల్కహాల్ ఇథనాల్ శాతం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఆ ఇథనాల్ 30 సెకన్లలో కరోనా వైరస్ని చంపుతుందని చాలా సర్వేల్లో తేలింది. బ్లీచ్ లాగే వైరస్ కి  కారణమైన ప్రొటీన్, ఆర్ఎన్ఏ ని నాశనం చేస్తుంది. శుభ్రంగా ఉన్నక్లాత్ పై  సర్కజిల్ స్పిరిట్ చల్లి ఇంట్లోని వస్తువులు,ప్లోర్ ను తుడిస్తే నిమిషాల్లోనే వైరస్ చనిపోతుంది.

కానీ క్లీన్ చేసేటప్పుడు  తప్పనిసరిగా గ్లోవ్స్‌ వేసుకోవాలి. కేవలం సర్కజిల్ స్పిరిటే కాదు ఆల్కహాల్‌ కలిసిన క్లీనిం గ్ ఏజెంట్స్ ఏవైనా కరోనాను ఖచ్చితంగా చంపే స్తాయి. కాబట్టి 70శాతం ఆల్కహాల్ కలిసి ఉన్న ప్రొడక్స్ ట్నే క్లీనింగ్ కి   ఉపయోగించాలి.

సర్ఫేస్ వైప్స్

సర్ఫేస్ వైప్స్  ఇంటి క్లీనిం గ్ తేలికవడంతో చాలామంది వీటినే ఎంచుకుంటున్నారు. కానీ ఇవి హ్యూమన్ కరోనా వైరస్ ని  కట్టడి చేయగలవని ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఈ సర్ఫేస్ వైప్స్ లోని యాంటీ సెప్టిక్ బెంజాల్కో నియం ఫ్లోర్పై పేరుకుపోయిన క్రిముల్ని, హానికారక

రసాయ నాల్ని తొలగిస్తుంది. ఇంట్లోని వస్తువులు, ఫ్లోర్ని వైప్స్  శుభ్రం చేస్తే హానికారక క్రిములన్నీ వైప్స్ తో పాటు వచ్చేస్తాయి. అంతేకాదు క్లీన్  తర్వాత కూడా క్రిములు చేరకుండా ఒక లేయర్ ని ఏర్పాటు చేస్తాయి ఈ వైప్స్

పొడిబారిన చేతులకి

కరోనా భయంతో చీటికీ మాటికీ చేతులు శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. కానీ, పదే పదే చేతులను శానిటైజర్ , సబ్బుతో శుభ్రం చేసుకోవడం వల్ల చేతివేళ్లు పొడిబారతాయి. అంతేకాదు వాటిల్లోని కెమికల్స్ వల్ల దురద కూడా వస్తుంది. దాంతో చేతులు నిర్జీవంగా మారతాయి. మరీ ఈ సమస్యనుంచి బయటపడాలంటే పొందాలంటే ఇలా చేయండి.

ఆయిల్ మసాజ్ పొడిబారిన చేతులకు మసాజ్ ఆయిల్ బెస్ట్ ఆప్ష న్. రెండుమూడు నిమిషాల పాటు ఏదైనా వంటనూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ చేతివేళపై మసాజ్ చేస్తే చేతులు మృదువుగా అవుతాయి. అంతేకాదు ఆయిల్ మసాజ్ వల్ల చేతులు స్ట్రాంగ్ అవుతాయి.

మీగడ

కాస్తంత మీగడని చేతలపై రాసి రుద్ది తే చేతులు మృదువుగా అవుతాయి. అంతేకాదు తెల్లగా మెరుస్తాయి కూడా. మీగడ వల్ల చేతివేళ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నిమ్మతో ఒక గిన్నెలో గోరు వెచ్చని నీళ్లు తీసుకుని అందులో నిమ్మరసం పిండాలి. ఆ నీళలో చేతుల్ని పదిని మిషాలు మునిగేలా పెట్టాలి. ఇలా చేస్తే రసాయనాల వల్లపొడిగా, జీవం లేకుండా మారిన చేతులు ఆరోగ్యంగా, మృదువుగా మారతాయి. గ్లిజరిన్, రోజ్ వాటర్ రాత్రి పడుకోబోయే ముందు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లో  కొన్ని గ్లిజరిన్  చుక్కలు కలిపి చేతులకు రాయాలి. అలా చేస్తే వేళ్లు మృదువుగా.. అందంగా ఉంటాయి. నిమ్మ, టొమాటో నిమ్మ, టొమాటో రసాల్ని సమపాళ్లల్లో తీసుకొని ఒక చిన్న గిన్నెలో పోసి అందులో కొద్దిగా గ్లిజరిగ్లి న్‌ వేసి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకొని పది నిమిషాలు మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత చల్ల టి నీళ్లతో  చేతులు కడుక్కోవాలి. ఇలా చేస్తే చేతులు మృదువుగా తయారవుతాయ

Latest Updates