పేటీఎం ఫాస్ట్ టాగ్ ని డియాక్టివేట్ చేసుకోండిలా..

పేటీఎం ఫాస్ట్ టాగ్ ని డియాక్టివేట్ చేసుకోండిలా..

దేశవ్యాప్తంగా పేటీఎం బ్యాంక్ సర్వీస్ ను రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్ సేవలు కొనసాగవు. అయితే పేటీఎం బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయిన ఫాస్ట్ టాగ్ యూజర్స్ ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. వేలు పెట్టి రీజార్జ్ చేసుకున్న కార్డ్స్ ఇప్పుడు పనిచేయవా? అని ఆంధోళనకు చెందుతున్నారు. మీకు పేటీఎం ఫాస్ట్ టాగ్ అంకౌంట్ ఉంటే దాన్ని వేరే బ్యాంక్ కు మార్చుకోవచ్చు, లేదా డియాక్టివేట్ చేయవచ్చు. పేటీఎం ఫాస్ట్ టాగ్ అకౌంట్ ను ఈ క్రింది విధంగా డియాక్టివేట్ చేసుకోవచ్చు.

మీ Paytm ఫాస్ట్‌ట్యాగ్‌ని ఎలా డీయాక్టివేట్ చేయాలంటే..?

>  FASTag Paytm పోర్టల్‌ లోకి యూజర్ ఐడీ లేదా వాలెట్ ఐడీ, పాస్‌వర్డ్ తో లాగిన్ అవ్వండి
> తర్వాత ఫాస్ట్ టాగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ తో వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి.
> పోర్టల్‌లోని సర్వీస్ రిక్వెస్ట్ లోకి వెళ్లి ‘ది ఫాస్ట్‌ ట్యాగ్’ కేటగిరీని ఎంచుకోండి.
>  పేజీని క్రిందికి స్క్రోల్ చేసి హెల్ప్ & సపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
>  అక్కడ ఫాస్ట్ టాగ్ డియాక్టివేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
> దీని తర్వాత ఎందుకు మీ అకౌంట్ డిలెట్ చేయాలకుంటున్నారో రీజన్ ఎంచుకోండి. 
మీ రిక్వెస్ట్ పై ఓ రిఫరెన్స్ నెంబర్ క్రియేట్ అవుతోంది. దాన్ని మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత కొంత సమయానికి ఫాస్ట్ టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అవుతోంది. 
ఒకసారి మీ ఫాస్ట్ టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అయితే మళ్లీ ఆ అకౌంట్ పొందలేరు.

Also Read: అబుదాబిలో యూపీఐ, రూపే కార్డ్​.. సేవలు ప్రారంభించిన మోదీ