ఇంట్లో పొల్యూషన్‌‌ ఎట్ల పోవాల్నంటే

పొల్యూషన్ అంతా ఇంటి బయటే ఉంటుంది అనుకుంటారు. అందుకే, బయటకు వెళ్తే చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. మరి ఇంట్లో పొల్యూషన్ సంగతి ఏంటి? అంటే  ఇంట్లో ఏమన్న ఫ్యాక్టరీలు ఉన్నయా? వెహికిల్స్ నడుస్తున్నయా? అనుకుంటున్నరు కదా! కానీ, ఇండోర్‌‌‌‌ పొల్యూషన్ కారకాల్ని గుర్తించకుంటే పొల్యూటెడ్‌‌ ఇంట్లో ఉంటున్నట్టే లెక్క! అవేంటో ఒక్కసారి చూద్దాం..

బయట పొల్యూషన్‌‌లో తిరిగితే తలనొప్పి, వికారం అనిపించినట్టే.. ఇండోర్ పొల్యూషన్‌‌కి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అవుట్‌‌డోర్ పొల్యూషన్‌‌లో ఉండే దాని కంటే ఇండోర్‌‌‌‌ పొల్యూటెంట్స్ రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువే ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో ఇది వంద రెట్లు వరకూ ఉండొచ్చు! ఇలా ఇంట్లో ఎయిర్ పొల్యూషన్‌‌ ఉన్నప్పుడు ఆస్తమా, శ్వాస ఆడకపోవడం, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇంట్లో ఎయిర్‌‌‌‌ పొల్యూషన్‌‌కి కారణమవుతున్న విషయాల్ని గుర్తించి.. ఎయిర్ క్వాలిటీ పెంచే ప్రయత్నం చేయాలి. ఇది ఇంటిల్లిపాదికి మంచిది!

కిచెన్

ఇండోర్‌‌‌‌ ఎయిర్ పొల్యూషన్‌‌లో మేజర్ కంట్రిబ్యూటర్ కిచెన్.  టెఫ్లాన్ కోటెడ్‌‌ వంట గిన్నెలు, వెంటెడ్ గ్యాస్ స్టవ్స్‌‌  హానికరమైన గ్యాసెస్‌‌, కెమికల్స్‌‌ని రిలీజ్ చేస్తాయి. వీటి వల్ల తలనొప్పి, కన్‌‌ఫ్యూజన్‌‌, ఊపిరితిత్తుల సమస్యలు, వాంతులు లాంటి సమస్యలు వస్తాయి.

థర్డ్‌‌ హ్యాండ్ స్మోక్‌‌

ఫస్ట్ హ్యాండ్‌‌, సెకండ్ హ్యాండ్‌‌ స్మోక్ డేంజర్ అని మనకు తెలుసు. కానీ, థర్డ్ హ్యాండ్ స్మోక్‌‌ కూడా అంతే సమానంగా ఆరోగ్యానికి హాని చేస్తుంది.  స్మోక్​ చేసేవాళ్లది ఫస్ట్ హ్యాండ్ స్మోక్, వాళ్ల పక్కన ఉండి పీల్చేవాళ్లది సెకండ్ హ్యాండ్‌‌ స్మోక్. సిగరెట్ తాగిన తర్వాత  ఆ పొగ వెళ్లి బట్టల్లో, గోడలపై, కార్పెట్స్‌‌, కుషన్స్ లాంటి మెటీరియల్స్‌‌తో చేరి అలాగే ఉండిపోతుంది. ఇది తర్వాత  సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్‌‌కి దారి తీస్తుంది.

పెయింట్‌‌

ఇల్లు కలర్‌‌‌‌ఫుల్‌‌గా మెరిసిపోవాలని అంతా కోరుకుంటారు. కానీ, గోడలకు పెయింటింగ్ వేసినప్పుడు అందులో వొల్టాయిల్ ఆర్గానిక్‌‌ కంపౌండ్స్‌‌ (వోఓసీ) ఉంటాయి.  ఇవి హానికరమైన కెమికల్స్. గోడ తడిగా ఉన్నప్పుడు ఈ కెమికల్స్ గాల్లోకి రిలీజ్ అవుతాయి.  ఆ గాలి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. కాబట్టి, పెయింట్స్‌‌ కొనేటప్పుడు వీఓసీ లేని పెయింట్స్ లేదా తక్కువ వీఓసీ ఉన్న పెయింట్స్‌‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే, పెయింటింగ్ వేసిన కొన్నాళ్ల వరకూ కిటికీలు తెరిచే ఉంచాలి.

కార్పెట్స్‌‌

కార్పెట్‌‌ కొత్తదైనా, పాతదైనా…పొల్యూషన్‌‌ చేయడంలో  ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి. కొత్త ఫ్యాబ్రిక్ కార్పెట్‌‌ నుంచి హానికరమైన గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అలాగే, పాత కార్పెట్‌‌ వాడటం వల్ల ఎలర్జీలు వస్తుంటాయి. ఈ కార్పెట్‌‌లో పెంపుడు జంతువులు ఆడుకుంటాయి.  అలాగే, దుమ్ము, పురుగులు లోపలే ఉండిపోతాయి. ఇది చేసే ఎయిర్ పొల్యూషన్‌‌ వల్ల తలనొప్పి, ర్యాషెస్‌‌, ఐ, త్రోట్ ఇరిటేషన్ లాంటి సమస్యలు ఎదురవుతాయి.  కాబట్టి, వారంలో ఒక్కసారైనా  కార్పెట్‌‌ని  మంచిగా క్లీన్‌‌గా చేయాలి.

క్లీనింగ్‌‌ ప్రొడక్ట్స్‌‌

ఇంటిని, వాష్‌‌రూమ్‌‌ని క్లీన్ చేసే ప్రొడక్ట్స్‌‌… ఇంటిని క్లీన్ చేయడంలో మాత్రమే హెల్ప్‌‌ చేస్తాయి అనుకుంటున్నారా? అయితే, పప్పులో కాలేసినట్టే.  కొన్ని రకాల క్లీనింగ్‌‌ సప్లయిస్‌‌లో టాక్సిక్‌‌ కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతుంది. ఆ టైమ్‌‌లో ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, క్లీనింగ్ ప్రొడక్ట్‌‌ కొనేముందు దాని  లేబుల్‌‌ని కచ్చితంగా చదవాలి. అది ఎరోజల్ ఫ్రీనా? సువాసన లేని ప్రొడక్టేనా? అని నిర్థారించుకున్న తర్వాతే కొనాలి.

 

Latest Updates