ఫేస్​బుక్​ డాటా సేవ్​ ఎలా?

రోజూ ఫేస్​బుక్​ చూస్తుంటే టైమ్, డాటా రెండూ సరిపోవు. రోజులో ఎక్కువ డాటా యూజ్​అయ్యే వాటిలో ఫేస్​బుక్​ యాప్​ ఒకటి. తక్కువ డాటా ప్లాన్​ వాడుతున్న వాళ్లకు ఫేస్​బుక్​ వల్ల నెట్ తొందరగా అయిపోతుంది. అలాగని ఫేస్​బుక్​చూడకుండా ఉండలేరు. దీనికో పరిష్కారం ఉంది. ఫేస్​బుక్​లో డాటా సేవ్ ఆప్షన్​ ఉంది. ఫేస్​బుక్​ యాప్​లో పైన కనిపించే ‘హ్యాంబర్గర్’ ఐకాన్​పై క్లిక్​ చేయాలి. అక్కడ కనిపించే సెట్టింగ్స్, ప్రైవసీపై ట్యాప్​ చేసి, కింద కనిపించే డాటా సేవర్​ ఆప్షన్ ​ఆన్​ చేసుకోవాలి.

దీనివల్ల ఫేస్​బుక్​లో యూజర్లు చూసే ఫొటో, వీడియోల సైజు తగ్గుతుంది. కొంచెం తక్కువ క్వాలిటీతో వీడియోలు ప్లే అవుతుంటాయి. లో క్వాలిటీతోనే వీడియోలు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. అలాగే ఆటో ప్లే వీడియో ఆప్షన్​ కూడా ఆగిపోతుంది. దీనివల్ల తక్కువ డాటాతోనే చాలా సేపు ఫేస్​బుక్​ చూడొచ్చు.

Latest Updates