గల్లీలో బైక్ ఎలా సీజ్ చేస్తారు..? ఎస్సైతో యువతి గొడవ..

మైనర్ యువకుడి బైకును సీజ్ చేసిన పోలీసులు
ట్రాఫిక్ ఎస్సైతో యువతి వాగ్వాదం
ఐపీఎస్ తనకు తెలుసంటూ హల్ చల్

గల్లీలో బైక్ ఎలా సీజ్ చేస్తారు..? హైవేలో కదా సీజ్ చేయాలి. ఇలా సీజ్ చేస్తే నేను ఒప్పకోను’ అంటూ ఓ యువతి ట్రాఫిక్ సీఐతో గొడవకు దిగింది. లాక్డౌన్ సందర్భంగా షాద్ నగర్ ట్రాఫిక్ సబ్ఇన్స్పెక్టర్ రఘు కుమార్ వాహనాల తనిఖీ చేస్తున్నాడు. అంతలోనే ఆ వైపుకు బైకు మీద వచ్చిన మైనర్ బాలుడిని ఆపి.. బండిని సీజ్ చేశారు. బాలుడు విషయాన్ని తన అక్కకు చెప్పాడు. వెంటనే అక్కడకు వచ్చిన బాలుడి అక్క.. గల్లీలో బైక్ ఎలా సీజ్ చేస్తారు? అంటూ ఎస్సైతో గొడవకుదిగింది.

ఐపీఎస్ మేడం మాకు తెలుసంటూ ఫోన్ కలుపుతూ కాసేపు హడావుడి చేసింది. సదరు యువతికి ఎస్సై రఘు కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ.. కాస్త వినమ్మా అంటే నేను వినను అంటూ హల్ చల్ చేసింది. ఎస్సైతో గొడవకు దిగిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని తిరుమల కాలనీ చౌరస్తాలో శనివారం జరిగింది. గల్లీలో బైకులు నడుపొచ్చని ఎస్సైతో వాగ్వాదానికి దిగింది. అయినా గల్లీలో బైకులు సీజ్ చేయకూడదని ఏకాంగ ఎస్సైనే గదమాయించింది. చివరకు యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ కలిపి ఎస్సై రఘుకి ఇవ్వగా.. ఆయన వారి కుటంబ సభ్యులకు నిబంధనలు తెలియజేశారు. యువతి తల్లిదండ్రులకు చెప్పి ఎస్సై రఘు బైక్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

For More News..

కరోనాతో చనిపోయిన భర్త.. ఫోన్లో ఊహించని మెస్సెజ్ చూసిన భార్య

వరల్డ్ ట్రయాథ్లాన్ గ్రాండ్ ఫైనల్ రద్దు

లాక్డౌన్ లో కొత్త దందా.. కారు ఫేక్ పాస్ కు రూ. 30,000

Latest Updates