ఫేక్ యాప్స్‌‌‌‌ను కనిపెట్టండిలా…

మొబైల్ ఫోన్‌‌తో ఎన్ని నష్టాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.స్మార్ట్ ఫోన్ అడిక్షన్ నుంచి ప్రైవసీ ఇష్యూస్ వరకూ అన్నిరకాలుగా మొబైల్‌‌తో తిప్పలే. అయితే మొబైల్‌‌తో ఇన్ని ఇబ్బందులు ఉండడానికి అందులో ఉండే యాప్స్ ఒక కారణం. ఒకవేళ మొబైల్‌‌లో మంచి యాప్స్ ఉంటే నష్టం కాస్త తక్కువ ఉంటుంది. అదే మొబైల్ నిండా ఫేక్ యాప్స్ ఉంటే.. ఇక ఆ యూజర్ ప్రైవసీని గాలికి వదిలినట్టే. అందుకే ఫేక్ యాప్స్‌‌తో కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం.

ఎవరైనా ఒక యాప్‌‌ను ఇన్‌‌స్టాల్​చేయాలంటే. ప్లే స్టోర్ నుంచి డౌన్‌‌లోడ్ చేయాలి. అయితే ఆ ప్లేస్టోర్‌‌‌‌లో కూడా కొన్ని నకిలీ యాప్స్ ఉంటాయి. వాటిని పసిగట్టి ఇన్‌‌స్టాల్ చేయకుండా ఉంటే చాలావరకూ సేఫ్‌‌గా ఉండొచ్చు. ప్లేస్టోర్‌‌‌‌లో షాపింగ్ నుంచి ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ వరకూ గేమ్స్, పేమెంట్స్, న్యూస్ ఇలా ఎన్నో రకాల యాప్స్ ఉంటాయి. వాటిలో కొన్ని ఫేక్ యాప్స్‌‌ కూడా ఉంటాయి. ప్లే స్టోర్‌‌లో ఈ ఫేక్ యాప్స్‌‌కు బ్రేక్ వేయడానికి గూగుల్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. చాలా రకాల ప్రైవసీ కండిషన్స్‌‌ కూడా పెట్టింది. అయినప్పటికీ కొన్ని ఫేక్ పాలసీల ద్వారా ప్లేస్టోర్‌‌‌‌లోకి రకరకాల నకిలీ యాప్స్ వచ్చేశాయి. ఈ నకిలీ యాప్స్‌‌ను గూగుల్ కనిపెట్టలేకపోయినా.. కొన్ని టిప్స్ ద్వారా మనమే కనిపెట్టొచ్చు. అదెలాగంటే…

  • ప్లే స్టోర్‌‌‌‌లో ఏదైనా యాప్ కోసం వెతికేటప్పుడు.. ఆ పేరుకి దగ్గరగా ఉన్న యాప్స్ బోలెడు కనిపిస్తాయి. స్పెల్లింగ్‌‌లో ఒకటి రెండు అక్షరాల తేడాతో చూడ్డానికి ఒకేలా కనిపిస్తాయి. ఇలాంటప్పుడే జాగ్రత్తగా మనకు కావాల్సిన యాప్‌‌ను స్పష్టంగా ఎంచుకోవాలి. ఆ ఒక్క యాప్ తప్ప అదే పేరుతో ఉన్న మిగతావన్నీ ఫేక్ అని గుర్తించాలి.
  • అలాగే ప్లే స్టోర్‌‌‌‌లో ఒక యాప్ కోసం వెతికేటప్పుడు ‘ఎడిటర్స్ ఛాయిస్’ లేదా ‘టాప్ డెవలపర్’ లాంటి ట్యాగ్‌‌లు కనిపిస్తే అవి నమ్మకమైనవి అని అర్థం. నకిలీ యాప్స్‌‌కు ఎలాంటి ట్యాగ్సూ ఉండవు.
  • యాప్ డౌన్‌‌లోడ్ చేసేముందు దాని డౌన్‌‌లోడ్స్ సంఖ్యను కూడా గమనించాలి. ఐదు వేలు లేదా అంతకంటే తక్కువ
  • డౌన్ లోడ్స్ ఉండే యాప్స్ ఫేక్ అయి ఉండే అవకాశాలు ఎక్కువ.
  • యాప్ డౌన్‌‌లోడ్ చేసేముందు రేటింగ్స్, రివ్యూస్ చదివి ఇన్‌‌స్టాల్ చేయడం మంచిది. కొన్ని ఫేక్ యాప్స్ చూడ్డానికి ప్రొఫెషనల్‌‌గా, అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. అందుకే ఇన్‌‌స్టాల్ చేసేముందు రివ్యూలు చదివితే వాటి సంగతి బయటపడుతుంది. అలాగే యాప్ ఇన్‌‌స్టాల్​ చేసేముందు దాన్ని అప్‌‌లోడ్ చేసిన లేదా అప్‌‌డేట్ చేసిన డేట్‌‌ను చెక్ చేసుకోవాలి. డేట్ రీసెంట్‌‌ది అయ్యి ఉంటే నమ్మదగ్గ యాప్ కింద లెక్క.
  • అన్నింటికంటే ముఖ్యంగా యాప్‌‌ను ఇన్‌‌స్టాల్ చేసేముందు అది అడిగే పర్మిషన్లు ఒకసారి చెక్ చేసుకోవాలి. అవసరం లేని పర్మిషన్లు అడిగే యాప్స్‌‌ని తీసివేస్తే మంచిది. ఉదాహరణకు ఫొటో ఎడిటింగ్ చేసే యాప్‌‌కు, స్టోరేజ్, మీడియా, కెమెరా లాంటి పర్మిషన్‌‌ల అవసరం ఉంటుంది. మైక్రోఫోన్ అవసరం దానికి ఉండదు. అలా ఏ యాప్‌‌కి ఎలాంటి పర్మిషన్లు అవసరమో తెలుసుకుని పర్మిషన్లు ఇవ్వాలి.

స్లో అవ్వడానికి కూడా..

సరైన ప్రైవసీ పాలసీలు లేకుండా ప్లే స్టోర్‌‌‌‌లోకి ఎంటర్ అయ్యే యాప్స్ వల్ల చాలారకాల ప్రైవసీప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి యాప్స్​.. యాడ్స్‌‌ని డిస్ ప్లే చేస్తూ మొబైల్ డేటాను మొత్తం వాడేస్తాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్‌‌ను కూడా దొంగిలిస్తాయి. ఫేక్ యాప్స్‌‌కు సరైన సాఫ్ట్‌‌వేర్ సపోర్ట్ ఉండదు. కాబట్టి అవన్నీ బేసిక్ వెర్షన్‌‌పై నడుస్తూ ఉంటాయి. ఎప్పటికీ అప్‌‌డేట్ అవ్వవు. అలాంటి యాప్స్ ద్వారా మొబైల్‌‌కు మాల్ వేర్, యాడ్ వేర్ లాంటి వైరస్‌‌లు వచ్చే అవకాశం ఉంటుంది. మొబైల్ స్లో అవ్వడానికి కూడా ఇలాంటి యాప్స్ కారణం. అందుకే యాప్ ఇన్‌‌స్టాల్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Latest Updates