మీటర్లు లేకుండా..  ఫ్రీ వాటర్ అమలెలా!

  • గ్రేటర్​లో 7.5 లక్షల నల్లా కనెక్షన్లకు లేవ్​​
  • ఫ్రీ వాటర్ స్కీమ్ సాధ్యమయ్యేనా!
  • ప్రతి కనెక్షన్ కు మస్ట్ గా మీటర్ రూల్
  • ఏర్పాటుకు జనాల నుంచి నో రెస్పాన్స్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లో ఫ్రీ వాటర్ ​స్కీమ్ అమలు సాధ్యాసాధ్యాలపై అనుమానాలు తలెత్తున్నాయి.  ఫ్రీ వాటర్ పొందాలంటే ప్రతి నల్లాకు మీటర్ ఉండాలనేది సర్కార్ ​రూల్. అయితే మీటర్​ను వినియోగదారుడే బిగించుకోవాల్సి ఉంది. దాని ఏర్పాటుకు ఖర్చులను కూడా సొంతంగానే పెట్టుకోవాలి.  సిటీలో 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉంటే, వీటిలో 2.5 లక్షలకు మాత్రమే మీటర్లు ఉన్నాయి. మిగిలిన 7.5లక్షలకు లేకుండానే వాటర్​సప్లయ్ అవుతోంది. మీటర్లు లేని ఏరియాలకు డాకెట్ పద్ధతిలో వాటర్​సప్లయ్ చేస్తున్నారు. తాజాగా ఫ్రీ వాటర్ కావాలంటే మీటర్ పెట్టుకోవాలనే రూల్ పై మళ్లీ చర్చ మొదలైంది. ఇప్పటికే ఆధార్ సీడింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఫ్రీ వాటర్​ స్కీమ్​లో భాగంగా మీటర్ల ఏర్పాటుకు అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావించారు. అయితే  జనాల నుంచి ఆశించిన మేర స్పందన రావడం లేదని తెలిసింది. దీంతో స్కీమ్ అమలు   సక్సెస్ ​అయ్యేనా అనే దానిపై స్పష్టత రావడం లేదు.

బిల్లే కట్టడం లేదు.. వేలు పెట్టి కొంటరా..

బల్దియా ఎన్నికల హామీ మేరకు ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్​ సప్లయ్ చేయాలని సర్కార్​ నిర్ణయించింది. ఇప్పటికే మంత్రి కేటీఆర్​ స్కీమ్​ను కూడా ప్రారంభించారు. అయితే రెండు వందల బిల్లు దాటని కనెక్షన్లు ఉన్న వాళ్లు వాటర్ ​కోసం రూ.2 వేలతో మీటర్ ​బిగించుకుంటరా అనే ప్రశ్న తలెత్తుతోంది. 15 ఎంఎం నల్లాకు మీటర్​పెట్టుకోవాలంటే పైపులకు రూ.1,500, ఇన్ స్టాలేషన్ కు మరో రూ.500 నుంచి రూ.1000 వరకు ఛార్జ్ చేస్తారు. అదే 20 ఎంఎం పైపు అయితే రూ.2500 మీటరు ఛార్జి, రూ.1000 నుంచి రూ.1500 వరకు భరించాల్సి ఉంటుంది. ఇక మీటర్లను వాటర్ బోర్డు ఎంపిక చేసిన ఏజెన్సీల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే ప్లాట్ ఏరియాను బట్టి రూ. 2500 నుంచి రూ.50వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఆర్థిక అంశాలు ముడిపడి ఉండగా, నల్లాలకు మీటర్ల ఏర్పాటు సాధ్యమయ్యేనా అనే అనుమానాలు తలెత్తున్నాయి.

అక్రమ నల్లా కనెక్షన్ల లెక్క తేల్చకుండా..

అక్రమ నల్లా కనెక్షన్లను తేల్చే క్రమంలో వాటర్ బోర్డు 2019లో ఇంటింటి సర్వే చేసింది. దీంతో దాదాపు లక్షన్నర ఉన్నాయనేది తేలింది. అయితే వీటికి మీటర్లు వినియోగదారులే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నల్లా బిల్లు కట్టకుండా అక్రమంగా నీటిని వాడుతుండగా, వీరంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీటర్లు పెట్టుకుంటారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అక్రమ నల్లా కనెక్షన్ల లెక్క విషయం తేల్చకుండా మీటర్లు మస్ట్​ చేయడం ఆశించిన ఫలితం ఇవ్వదని వాటర్ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.

For More News..

కిరాయికి వ్యవసాయ పనిముట్లు.. సెంట్రల్ గవర్నమెంట్ సరికొత్త స్కీం

మనుషులకే కాదు.. పసులకూ ఓ హాస్టల్

స్టూడెంట్లకు పూలతో స్వాగతం పలుకుతున్న స్కూల్స్

Latest Updates