లాక్ డౌన్ 4.0 ఎలా ఉంటదో.? రేపటితో థర్డ్ ఫేజ్ క్లోజ్

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడో దశ లాక్​డౌన్ మరొక రోజులో ముగియబోతోంది.. ఈనెల 18 నుంచి ఫోర్త్ ఫేజ్ అమల్లోకి రానుంది. 4.0 కొత్తగా ఉంటుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. వచ్చే రెండు రోజుల్లో గైడ్​లైన్స్ ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు కూడా తమ అభిప్రా యాలు తెలియజేశాయి. నాన్​కంటెయిన్​మెంట్ జోన్లలో మెట్రో సర్వీసులు, విమానా లు సహా పబ్లిక్ ట్రాన్స్​పోర్టేషన్​కు అనుమతి ఇవ్వాలని, ఎకనమిక్ యాక్టివిటీలను ప్రారంభించాలని చాలా రాష్ట్రాలు కోరాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్​డౌన్ మరింత కఠినంగా కొనసాగించాలని కోరుతున్నాయి.

ఢిల్లీ..

కంటెయిన్​మెంట్ జోన్లు మినహా ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో కొన్ని ఎకనమిక్ యాక్టివిటీలకు అనుమతి ఇవ్వాలని ఆ రాష్ర్ట సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కోరారు. స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఎక్కువ ప్రాంతాలు రెడ్ జోన్లలో ఉండటంతో.. మరిన్ని ఆంక్షలను సడలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గుజరాత్..

అన్ని మేజర్ అర్బన్ సిటీల్లో అన్ని రకాల ఎకనమిక్ యాక్టివిటీలను ప్రారంభించాలని కోరుతోంది. అయితే ఇక్కడి పరిస్థితిపై కేంద్రం ఆందోళనలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

కేరళ..

ఎక్కువగా టూరిజంపైన ఆధారపడిన కేరళ.. మెట్రో, లోకల్ ట్రైన్లు, డొమెస్టిక్ ఫ్లైట్లు నడిపేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతోంది. అలాగే రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచేందుకు ఓకే చెప్పాలని అడుగుతోంది. ఇక్కడ దేశంలోనే తొలి కేసు నమోదైనా.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వ్యాప్తిని సమర్థంగా అడ్డుకుందని, అందుకే సడలింపులు ఇవ్వాలని కోరుతోందని ఓ అధికారి చెప్పారు.

అస్సాం..

సీఎం సర్బానంద సోనోవాల్ కూడా లాక్ డౌన్ పొడిగించాలని కోరారు. అయితే ఏ విషయమైనా కేంద్రమే తీసుకోవాలన్నారు. చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కర్నాటక..

రెస్టారెంట్లు, హోటళ్లు, జిమ్స్ ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని కర్నాటక కోరుతోంది. ఈనెల 17 వరకు అక్కడ లిక్కర్ అమ్మేందుకు పబ్బులు, బార్లకు అనుమతి ఇచ్చింది.

తమిళనాడు..

కంటెయిన్​మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఎకనమిక్ యాక్టివిటీలకు పర్మిషన్ ఇవ్వాలని తమిళనాడు కోరుతోంది. ఇప్పటికే సొంతంగా కొన్ని సడలింపులిచ్చింది. షాపులు, ప్రైవేటు సంస్థలు ఎక్కువ సమయం ఓపెన్​లో ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చెన్నై మార్కెట్ నుంచి సుమారు 2,600 మందికి వైరస్ సోకింది.

బీహార్, జార్ఖండ్, ఒడిశా..

లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేయాలని ఈ మూడు రాష్ర్టాలు కోరుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయి. వలస కూలీలు భారీగా వస్తుండటంతో వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఈ నెలాఖరు వరకు లాక్​డౌన్ పొడిగిస్తున్నట్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ముందే ప్రకటించారు.

పంజాబ్..

లాక్​డౌన్ ఎక్స్​టెన్షన్ కోరిన వారిలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఉన్నారు. మరింత స్ర్టిక్ట్​గా లాక్​డౌన్ కొనసాగించాలని కోరారు. తమ రాష్ర్టంలో కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మహారాష్ట్ర..

దేశంలో కరోనా వల్ల అత్యంత ఎక్కువ ఎఫెక్ట్ అయిన రాష్ట్రం మహారాష్ట్ర. ఎకానమీ యాక్టివిటీలను ప్రారంభించేందుకు, ఆఫీసులను తెరిచేందుకు రెడీగా లేదు. లాక్​డౌన్ విషయంలో ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతోంది. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలకు పలు రాయితీలు ప్రకటించింది.

84% ఫ్యామిలీల ఆదాయం తగ్గింది

Latest Updates