నటుడు శివబాలాజీ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ

హైద‌రాబాద్: మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై సినీ నటుడు శివబాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించిన సంగ‌తి తెలిసిందే. ఫీజులు పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శివబాలాజీ ఫిర్యాదుపై బుధ‌వారం హెచ్ఆర్సీ స్పందించింది. మౌంట్ లిటేరా జీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీ ఆదేశించింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా డీఈవోకు హెచ్ఆర్సీ నోటీసులిచ్చింది.

స్కూల్ యాజమాన్యం ఫీజ్ కోసం వేధిస్తుంది అని శివ‌బాలాజీ ఫిర్యాదు చేశారు. ఫీజులు తగ్గించుకోమని అడిగితే తన కుమారుడిని ఆన్లైన్ క్లాసుల నుండి అర్ధాంతరంగా డిస్ కనెక్ట్ చేసారు అని తెలిపాడు.చాలా మంది తలిదండ్రులను ఇలానే ఇబ్బంది పెడుతున్నారు అని, వారంతా బయటికి చెప్పడానికి భయపడుతున్నారు అని శివబాలాజీ అన్నారు. ఇక ఈ స్కూల్ కారణంగా మేము కూడా సమస్యలు ఎదుర్కున్నాము అని కమెడియన్ ఆలీ కూడా చెప్పిన విషయం అందరికి తెలిసిందే.

Latest Updates