గేల్ కు విండీస్ బోర్డ్ కీలక బాధ్యతలు

విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్ గేల్ కు కీలక పాత్ర అప్పజెప్పింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. వరల్డ్ కప్ కోసం ఇప్పటికీ టీమ్ లోకి ఆహ్వానించిన బోర్డు..గేల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతను అప్ప జెప్పింది.  వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్న గేల్‌.. ఈ అవకాశం దక్కడంతో హ్యాపీగా ఉన్నాడట.

‘వెస్టిండీస్‌ తరఫున ఏ ఫార్మాట్‌కైనా ప్రతినిధ్యం వహించడం ఎప్పుడూ  గౌరవంగా భావిస్తాను.. ముఖ్యంగా ప్రపంచకప్‌ నాకు ఎంతో ప్రత్యేకం. ఓ సీనియర్‌ ఆటగాడిగా జట్టులో కెప్టెన్‌తోపాటు ఇతర ఆటగాళ్లకు మద్దతు ప్రకటించడం నా బాధ్యత. బహుశా ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇదే అతపెద్ద టోర్నీ. అందువల్ల మాపై భారీగా అంచనాలు ఉంటాయి.  విండీస్‌ అభిమానులను సంతృప్తి పరచడానికి మేం బాగా ఆడతాం’ అని తెలిపాడు గేల్‌.  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ టీమ్ లో 13 మ్యాచ్‌లు ఆడి మొత్తం 490 రన్స్ చేశాడు. జాసన్‌ హోల్డర్‌ కెప్టెన్సీలోని వరల్డ్ కప్ లో విండీస్‌.. మే 31న తన ఫస్ట్ మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది.

 

 

Latest Updates