హృతిక్ రోషన్ కొత్త ఇల్లు విలువెంతో తెలుసా?

ముంబై: సినీ సెలబ్రిటీల విషయంలో ఏ వార్త బయటకు వచ్చినా తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. మూవీ స్టార్స్ వేసుకునే బట్టలు, తిరిగే కార్లు, వాళ్లకు నచ్చిన బ్రాండ్లకు మంచి పాపులారిటీ ఉంటుంది. స్టార్స్ ఇళ్లకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రో్షన్ కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు నెట్‌‌లో వైరల్ అవుతోంది. ముంబైలోని జుహూ-వెర్సోవా లింక్ రోడ్‌‌లోని అపార్ట్‌‌మెంట్‌‌లో రూ.100 కోట్లు పెట్టి హృతిక్ ప్లాట్‌‌ను కొన్నట్లు సమాచారం. అరేబియా సముద్రం కనిపించేలా 38 వేల స్క్వేర్ ఫీట్‌‌ల మేర ఉన్న ఈ ఇంటిపైన 6,500 స్క్వేర్ ఫీట్ల టెర్రస్ ఉంది. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలను హృతిక్ తన ఇన్‌‌‌స్టా అకౌంట్‌‌లో షేర్ చేశారు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ఆశిశ్ షా ఈ ఇంటిని రూపొందించారు. ప్రస్తుతం హృతిక్ క్రిష్ ఫ్రాంచైజీ రానున్న నాలుగో పార్ట్‌‌లో నటించనున్నాడు.

Latest Updates