కంగనాతో గొడవ ఎందుకని తగ్గిన హృతిక్

బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. సందర్భం దొరికితే చాలు వీరు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే ఈ మధ్య వీరి గొడవలు తగ్గాయి. అయితే గత వారం రోజులగా మళ్లీ వీరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. హృతిక్ నటించిన సూపర్30, కంగనా నటించిన మెంటల్ హై క్యా సినిమాలు ఒకే రోజు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మెంటల్ హై క్యా విడుదలను వాయిదా వేయాలని సినిమా నిర్మాత ఏక్తా కపూర్ ను కంగన కోరారు. దీనికి ఆమె అంగీకరించలేదు. ఇదిలా ఉండగా, కంగన చేతిలో హృతిక్ పని అయిపోయిందని ఆమె చెల్లెలు రంగోలీ హెచ్చరించారు. రంగోలీ బెదిరింపులపై హృతిక్ స్పందించారు. అనవసరమైన వేధింపులను తట్టుకోలేక తన సూపర్30 విడుదలను వాయిదా వేయించానని హృతిక్ ట్విటర్ ద్వారా తెలిపారు. తన సినిమాకు ఎటువంటి హాని జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. తన నిర్ణయాన్ని తన నిర్మాతలు గౌరవించారని, తనను వేధించేవారిని కొందరు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘర్షణ పూరిత వాతావరణానికి స్వస్తి పలకాలని ఆయన కంగన, రంగోలీలను ఉద్ధేశించి అన్నారు.

Latest Updates