ఓపెన్‌ బ్యాడ్మింటన్‌: ప్రణయ్‌ కూడా ఔట్‌

HS Prannoy loses in New Zealand Open quarters

ఆక్లాండ్‌ : న్యూజిలాం డ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ లో ఇండియా పోరాటం ముగిసింది. టోర్నీలో మిగిలిన హెచ్‌ ఎస్​ ప్రణయ్‌ కూడా రాకెట్‌ ఎత్తేశాడు. గత మ్యాచ్‌లో సుగియర్టోను ఓడించి ఆశలురేపిన హెచ్‌ ఎస్‌ .. క్వా ర్టర్‌ ఫైనల్లోనే పరాజయం పాలై ఇంటిదారి పట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వా ర్టర్స్‌ లో అన్‌ సీడెడ్‌ ప్రణయ్‌ 21–17, 15–21,14–21తో ఐదో సీడ్‌కంటా సునెయమ (జపాన్) చేతిలో మూడు గేమ్‌ ల పాటు పోరాడి ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌ గంటా 13 నిమిషాల పాటు హోరాహోరీగాసాగింది. తొలి గేమ్‌ లో ఇద్దరు మంచి స్ట్రోక్స్‌ తో నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు . అయితే,13–13తో సమంగా నిలిచిన టైమ్‌ లో ప్రణయ్‌ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 17–13తో ఆధిక్యంలోకి వచ్చాడు. పోరాటం వదలని 11వ ర్యాంకర్‌ జపాన్‌ ప్లేయర్‌ 17–18తో ప్రణయ్‌ కు చేరువయ్యాడు.

ఒత్తిడిలో మెరుగ్గా ఆడిన ప్రణయ్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్‌ గెలిచా డు. అదే జోరుతో సెకండ్‌ గేమ్‌ లో 11–5తో లీడ్‌ లోకి వచ్చాడు. అయితే, సులువుగా మ్యాచ్‌ గెలుస్తాడని భావించిన ఇండియా  షట్లర్‌ సడన్‌గా వెనుకంజ వేశాడు. అనవసర తప్పిదాలు చేస్తూ ప్రత్యర్థికి పుంజుకునే చాన్స్‌ ఇచ్చాడు. దాంతో, వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచిన కంటా 14–11తో ముందంజ వేశాడు. ప్రణయ్‌ 14–14తో స్కోరు సమం చేసినా ..జపాన్‌ షట్లర్‌ మరోసారి విజృంభించి గేమ్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. ఇక, మూడోగేమ్‌ లో ఎవ్వరూ పాయింట్‌ ఇచ్చుకోకూడదన్నట్టు ఇద్దరూ గట్టిగా పోరాడారు. అయితే,14–14తో ఉన్న దశలో గేర్‌ మార్చిన సునెయమ వరుసగా ఏడు పాయింట్లు గెలిచి మ్యా చ్‌ ఖాతాలో వేసుకున్నాడు.

Latest Updates