TTDకి చేరిన 1381 కిలోల బంగారం

తిరుపతి: టీటీడీ ఖజానాకు 1381 కిలోల బంగారం సురక్షితంగా చేరింది. పటిష్ట బందోబస్తుతో టీటీడీ పరిపాలన భవనానికి చేర్చారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు.

చెన్నై నుండి తీసుకొస్తుండగా… మూడు రోజుల కింద తిరువళ్లూరు జిల్లా వేపంపట్టి దగ్గర అధికారులు ఈ బంగారాన్ని సీజ్ చేశారు.  సరైన ఆధారాలు లేక సీజ్ చేశామని ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు చెప్పారు. టీటీడీ అధికారులు, బ్యాంక్ అధికారులు ఇచ్చిన వివరణ, చూపిన ఆధారాలతో సంతృప్తి చెందిన అధికారులు.. 1381 కిలోల బంగారాన్ని సురక్షితంగా టీటీడీ ఖజానాకు చేర్చారు.

 

Latest Updates