ట్రంప్ రాకతో అహ్మదాబాద్‌‌కు మేకప్

ఢిల్లీ నుంచి గుజరాత్‌‌ రాజధాని వరకు సెక్యూరిటీ కట్టుదిట్టం
24న అహ్మదాబాద్​కు ట్రంప్ రాక
ఆహ్వానించనున్న మోడీ.. 22 కిలోమీటర్ల రోడ్ షో
సబర్మతి ఆశ్రమానికి వెళ్లనున్న ట్రంప్, మెలానియా
వల్లభాయ్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ ప్రోగ్రామ్
దారి పొడవునా స్వాగతం పలకనున్న లక్షలాది మంది ప్రజలు

వాషింగ్టన్/న్యూఢిల్లీ/అహ్మదాబాద్/జైపూర్అమెరికా అధినేత రాక కోసం ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు సెక్యూరిటీ కట్టుదిట్టమైంది. అమెరికా ప్రెసిడెంట్ హోదాలో డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మనదేశానికి వస్తుండటంతో గుజరాత్​లోని అహ్మదాబాద్ అందంగా ముస్తాబవుతోంది. ప్రపంచంలో అతి పెద్దదైన సర్దార్‌‌‌‌ వల్లభాయ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ స్టేడియం ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ప్రధాని మోడీతో కలిసి ట్రంప్ ప్రారంభిస్తారు. తర్వాత స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్‌‌‌‌’ కార్యక్రమంలో రెండు దేశాల అధినేతలు పాల్గొంటారు. కొన్ని నెలల కిందట అమెరికాలో జరిగిన ‘హౌడీ– మోడీ’ కార్యక్రమం మాదిరే నమస్తే ట్రంప్‌‌‌‌ ప్రోగ్రామ్ జరగనుంది.

ఢిల్లీలో కాకుంటే జైపూర్​లో..

ఢిల్లీలో వాతావరణం సరిగ్గా లేకపోతే జైపూర్‌‌‌‌లో ఎయిర్​ఫోర్స్​విమానం ల్యాండ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్​పోర్ట్ అధికారులు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. యూఎస్ ఎంబసీకి చెందిన ముగ్గురు మెంబర్లు సోమవారం జైపూర్ ఎయిర్​పోర్ట్ కు రాగా.. మరో నలుగురు సెక్యూరిటీ టీమ్ ​బుధవారం మరోసారి వచ్చి ఏర్పాట్లు, సదుపాయాలను ఆరా తీశారు. ఢిల్లీ ఎయిర్​పోర్ట్​లో ఏవైనా ఇబ్బందులు వస్తే జైపూర్ ఎయిర్​పోర్ట్​ను వాడుకునేందుకు ఎలాంటి ఇబ్బందులూ లేవని యూఎస్​టీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. ట్రంప్ టూర్ నేపథ్యంలో ఈనెల 24,25 తేదీల్లో జైపూర్ ఎయిర్​పోర్ట్ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

70 లక్షల మంది వస్తరంట!

‘‘ఎయిర్​పోర్ట్ నుంచి స్టేడియం వరకు స్వాగతం పలికేందుకు 70 లక్షల మంది వస్తారని ఆయన (మోడీ) చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. చాలా ఎక్సైటింగ్​గా ఉంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా’’ అని ట్రంప్ అన్నారు.

సమ్​థింగ్ స్పెషల్

గుజరాత్​లో అడుగుపెడుతున్న తొలి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ట్రంప్ పర్యటనకు చేస్తున్న ఖర్చు.. గుజరాత్ యాన్యువల్ బడ్జెట్​లో 1.5 శాతం. ఇందులో సెక్యూరిటీకే సగం ఖర్చు చేస్తున్నారు.సుమారు 12 వేల మంది పోలీసులను అహ్మదాబాద్​లో మోహరిస్తున్నారు.

‘ట్రేడ్ డీల్’ దాచుకుంటా

ట్రంప్‌‌‌‌ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ఎలాంటి ట్రేడ్ డీల్ జరిగే అవకాశం కనిపించడం లేదు. భారత్‌‌‌‌తో ‘భారీ డీల్‌‌‌‌’ను తాను దాచిపెట్టుకుంటానని ట్రంప్‌‌ చెప్పారు. అయితే నవంబర్‌‌‌‌లో జరిగే ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లోగా ఈ ఒప్పందం ఖరారవుతుందా లేదా అనే విషయం తనకు తెలియదని కామెంట్ చేశారు. ఇండియా పర్యటన కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. కానీ తమను ఇండియా సరిగా ‘ట్రీట్’ చేయలేదని ట్రంప్ కామెంట్ చేశారు.

24న ప్రోగ్రామ్స్

అహ్మదాబాద్​లోని వల్లభాయ్ పటేల్ ఎయిర్​పోర్టులో ల్యాండ్ అవుతారు. అక్కడ ట్రంప్ దంపతులను ప్రధాని మోడీ ఆహ్వానిస్తారు. ఎయిర్​పోర్టు నుంచి 22 కి.మీ. మేర ఇద్దరు నేతలు రోడ్​షో నిర్వహిస్తారు. దారి పొడవునా ఇద్దరు నేతలను ప్రజలు ఆహ్వానిస్తారు. మధ్యలో సబర్మతి ఆశ్రమంలో ట్రంప్, మోడీ 25 నిమిషాలు గడుపుతారు. ట్రంప్​కు రాట్నం, గాంధీ జీవితానికి సంబంధించిన రెండు పుస్తకాలు, గాంధీ చిత్రపటంను మోడీ అందజేస్తారు. ఆశ్రమంలో ఉన్న రాట్నంపై ట్రంప్ దంపతులు కొద్దిసేపు నూలు వడుకుతారు. 12.30కి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి ఇద్దరు నేతలు చేరుకుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది. ఇక్కడ జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో 1.25 లక్షల మందిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతారు.అంతకుముందు కొన్ని కల్చరల్ యాక్టివీటీలు జరుగుతాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతారు. కార్యక్రమం తర్వాత ట్రంప్ దంపతులు, ఇతర అధికారులతో కలిసి మోడీ లంచ్ చేస్తారు. 3.30 సమయంలో ట్రంప్, మెలానియా కలిసి ఆగ్రా బయలుదేరుతారు. 5 గంటలకు తాజ్ మహల్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ 30 నుంచి 45 నిమిషాలు గడుపుతారు. అటు నుంచి ఢిల్లీ వెళ్తారు.

25న ప్రోగ్రామ్స్

ఉదయం 10కి రాష్ర్టపతి భవన్​లో అధికారిక స్వాగతంతో ప్రోగ్రామ్స్ ప్రారంభమవుతాయి. ట్రంప్ దంపతులను ప్రధాని మోడీ, రాష్ర్టపతి రామ్​నాథ్ కోవింద్ దంపతులు ఆహ్వానిస్తారు. 10.45కి రాజ్​ఘాట్​కు చేరుకుంటారు. అక్కడ మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. 11.30కి ట్రంప్ దంపతులు హైదరాబాద్​హౌస్​కు చేరుకుంటారు. అక్కడ అధికారిక చర్చలు జరుపుతారు. ముందుగా ట్రంప్, మోడీ ఏకాంత చర్చలు జరుపుతారు. తర్వాత ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. చర్చలు జరుగుతున్నప్పుడు మెలానియా.. ఢిల్లీ ప్రభుత్వ స్కూల్​ను చూసేందుకు వెళ్తారు. స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అవుతారు. మోడీ, ట్రంప్ జాయింట్ ప్రెస్ స్టేట్​మెంట్ తో చర్చలు ముగుస్తాయి. ఈ సమయంలో ప్రశ్నలు, సమాధానాలకు అవకాశం ఉంటుందో లేదో స్పష్టత లేదు. తర్వాత లంచ్ చేస్తారు. 3 గంటలకు అమెరికా ఎంబసీకి ట్రంప్, ఆయన డెలిగేషన్ వెళ్తారు. అక్కడ టాప్ బిజినెస్ పర్సన్స్​తో సమావేశమవుతారు. తర్వాత రాష్ర్టపతి భవన్​కు వెళ్తారు. 8 గంటలకు రాష్ర్టపతి కోవింద్ ఇచ్చే విందులో పాల్గొంటారు. అటునుంచి ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు. ఢిల్లీ నుంచి 10 గంటలకు ఎయిర్​ఫోర్స్​వన్​లో బయలుదేరుతారు. జర్మనీ మీదుగా వెళ్తారు.

విమానం కాదు.. ఎగిరే ‘వైట్ హౌస్

అత్యంత విలాసమైన, భారీ విమానం ‘బోయింగ్ 747–200బి సిరీస్ ఎయిర్​క్రాఫ్ట్’​లో ట్రంప్, ఆయన భార్య మెలానియా వస్తున్నారు. ఈ విమానాన్ని ‘ఎయిర్​ఫోర్స్ వన్’ అని పిలుస్తారు. అమెరికా ప్రెసిడెంట్ ఉండే భవనం వైట్ హౌజ్ అయితే.. ఇది ఎగిరే వైట్ హౌజ్ లాంటిది. ఎయిర్ ఫోర్స్ వన్ రేంజ్ అన్​లిమిటెడ్. ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్లాలనుకుంటే అందులో అక్కడికి వెళ్లొచ్చు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వారు ఈ విమానంలోనే వెళ్తుంటారు. గత ప్రెసిడెంట్లు వాడిన విమానాలతో పోలిస్తే ఇది అత్యంత శక్తివంతమైనది. అతి పెద్దది కూడా. ఆకాశంలో దారి మధ్యలోనే ఫ్యూయల్ నింపే సౌకర్యం ఉంది. 4,000 చదరపు అడుగుల ఇంటీరియర్ ఫ్లోర్‌‌‌‌ స్పేస్‌‌‌‌ ఉంటుంది. ప్రెసిడెంట్, ఆయనతోపాటు వచ్చే వారికి మూడు లెవెల్స్​లో ఏర్పాట్లు ఉంటాయి. ప్రెసిడెంట్ కోసం భారీ సూట్ కూడా ఉంది. అందులో పెద్ద ఆఫీసు, టాయిలెట్, కాన్ఫరెన్స్ రూమ్ ఉంటాయి. మెడికల్ సూట్ కూడా ఉంటుంది. అందులో ఒక ఆపరేటింగ్ రూమ్​తో పాటు డాక్టర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

డైనింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌, ప్రెసిడెంట్, ఆయన భార్యకు ప్రత్యేక గదులు, సీనియర్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు ప్రత్యేక గదులు, వైద్య అవసరాల కోసం స్పెషల్ రూమ్, అధ్యక్షుడి సలహాదారులకు, ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ వన్‌‌‌‌ ఉద్యోగులకు, మీడియాకు కూడా వేర్వేరు గదులు ఉంటాయి. ఒకేసారి 100 మంది భోజనం చేసేలా ప్రత్యేక డైనింగ్‌‌‌‌ సదుపాయం ఉంది.అడ్వాన్స్​డ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ ఎక్వీప్​మెంట్ ఇందులో ఉంది. అమెరికాపై ఏదైనా దాడి జరిగినప్పుడు మొబైల్‌‌‌‌ కమాండ్‌‌‌‌ సెంటర్‌‌‌‌గా విమానం పనిచేస్తుంది. ఎలక్ర్టో మ్యాగ్నటిక్ దాడి నుంచి రక్షించుకోగలదు. రిమోట్ ఏరియాల్లో ప్రెసిడెంట్​కు అవసరమైన సేవలను అందించడానికి పలు కార్గో విమానాలు ఎయిర్ ఫోర్స్ వన్ కంటే ముందు వెళ్తుంటాయి. ఎయిర్​ఫోర్స్ వన్ విమానం మెయింటెనెన్స్, ఆపరేటింగ్​ను ప్రెసిడిన్షియల్ ఎయిర్​లిఫ్ట్ గ్రూప్ చూసుకుంటుంది.

see also: భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61

Latest Updates