అస్సాంలో భారీ పేలుడు.. ముగ్గురు ఫారెన్ ఎక్స్‌పర్ట్స్‌కు గాయాలు

న్యూఢిల్లీ: అస్సాంలోని తిన్సుకియా జిల్లా బఘ్జాన్‌లో బుధవారం భారీ పేలుడు చోటు చేసుకుంది. బఘ్జాన్‌లోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఆయిల్)లోని 5వ నెంబర్ గ్యాస్‌ బావిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయాల పాలయ్యారు. వీరిని ట్రీట్‌మెంట్‌ కోసం ఆస్పత్రిలో చేర్చామని ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి త్రిదిప్ హజారికా తెలిపారు. పాడైన గ్యాస్ బావి నుంచి గత 56 రోజులుగా గ్యాస్ వెలువడుతూనే ఉంది. మే 27న గ్యాస్ వెలువడటం మొదలైంది. ఈ ఘటనలో ఇద్దరు ఫైర్ ఫైటర్స్ కూడా మృతి చెందారు. జాగ్రత్త చర్యల్లో భాగంగా 9 వేల మంది ప్రజలను జూన్ 9న సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జూలై 18 నుంచి ఇప్పటివరకు తిన్సుకియాతోపాటు డూమ్‌డుమా సర్కిల్స్‌లో 1,751 ఫ్యామిలీస్‌ను కాపాడినట్లు పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పీఎస్‌యూ) తెలిపింది.

Latest Updates