సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం

Huge fire accident in siddipet

సిద్ధిపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విక్టరీ చౌరస్తాలోని ఓ వెదురు కర్రల దుకాణంలో మొదట మంటలు ఎగిసిపడ్డాయి. గాలి తోడవడంతో చుట్టు పక్కల ఉన్న 20 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అన్ని షాపుల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మొదట ఒకే ఫైరింజన్ ఉండడంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. ఆ తర్వాత ఐదు ఫైరింజన్లు వచ్చాయి. అగ్నిప్రమాదం జరిగిన దుకాణం పక్కనే ప్రైవేట్ ఆస్పత్రి ఉండడంతో రోగులు, వారి బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో సిద్ధిపేట-మెదక్ రోడ్ పై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రమాద తీవ్రత పెరుగుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే జనాన్ని అధికారులు తరలిస్తున్నారు.

 

 

 

Latest Updates