ప్రముఖులే టార్గెట్.. జుంబా డాన్స్ పేరుతో భారీ మోసం

హైద‌రాబాద్‌: న‌గ‌రంలో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. జుంబా డాన్స్ పేరుతో హైటెక్ మోసానికి పాల్పడ్డారు నిర్వాహ‌కులు. మ‌హిళా సాఫ్ట్‌వేర్లు. ప్ర‌ముఖుల పిల్ల‌లే టార్గెట్ గా చేసుకొని ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను దండుకున్నారు‌. ఫిట్ నెస్ కోసం జుంబా డ్యాన్స్ ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతున్న మ‌హిళ‌ల‌ను న‌మ్మించి.. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అయితే ఎంత‌కీ ట్రైనింగ్ ప్రారంభించ‌క‌పోవ‌డంతో మోస‌పోయామ‌ని తెలుసుకున్న ఇద్ద‌రు మ‌హిళలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. నిర్వాహకులను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.

న‌గ‌రంలోని మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని ప్రముఖులు టార్గెట్ గా ఈ బిజినెస్ నడుస్తోంది. జుంబా డాన్స్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసిన‌ట్టు ప్రాథ‌మిక విచార‌ణలో తెలిసింది.

Huge fraud in Hyderabad city under the name of Zumba Dance.. organizers arrest

Latest Updates