వ్యాన్ లో వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు

వెలుగు: పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను తీసుకెళుతున్న వాహనాన్ని కోల్ కతా పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ తోపాటు క్లీనర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుడు పదార్థాల తరలింపుపై సమాచారం అందడంతో చిత్పూర్ లోని తాలా బ్రిడ్జి దగ్గర్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఒడిశా నుంచి వస్తున్న గూడ్స్​వ్యాన్ ను ఆపి చెక్ చేయగా.. 27 సంచుల్లో వెయ్యి కిలోల పొటాషియం నైట్రేట్ దొరికిందని పోలీసులు చెప్పారు. దీన్ని పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారని వారు చెప్పారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్, క్లీనర్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇంద్రజిత్​భూయి, పద్మలోచన్ డే ఇద్దరూ ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన వారని చెప్పారు.

Latest Updates