పత్తి రైతులను ఆదుకోవాలంటూ భారీ ర్యాలీ

ప్రాణహిత వరదతో తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలంటూ మంచిర్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు, రైతులు. ఐబీ చౌరస్తా నుంచి కలక్టరేట్ వరకు జరిగిన ర్యాలీలో కోటపల్లి, వేమనపల్లి రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత పంటనష్టం పరిహారం చెల్లించాలంటూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. భారీ స్థాయిలో వచ్చిన వరదతో వందల ఎకరాల్లో పత్తి నీటమునిగిందని వాపోయారు రైతులు. వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్, ఇతర నేతలు పాల్గొన్నారు.

Latest Updates