నా సిస్టర్స్ ని గల్ఫ్ కి అమ్మేశారు.. కాపాడండి

 హైదరాబాద్: పేదరికంలోని కుటుంబానికి అండగా ఉండాలని, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నరకం చూస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్న క్రమంలో మరో బాధిత కుటుంబం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు తమ గోడు వెళ్లబోసుకుంది. దీనిపై ఆమెకు లేఖ రాసింది.

‘‘ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నా సిస్టర్స్ ఇద్దరిని గల్ఫ్ కు అమ్మేశారు.. వారిని కాపాడండి’’.. అంటూ హైదరాబాద్ యువతి నసీం బేగం కంటతడి పెట్టుకుంది. ఈ నెల మొదట్లో తన సిస్టర్స్ ని గల్ఫ్ ఏజెంట్లు ఒమన్ కు తీసుకెళ్లి అమ్మేశారని తెలిపింది. అక్కడ వారిని హింసిస్తున్నారని చెప్పింది. ఈ విషయంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కలగజేసుకుని, వారిని కాపాడి, తిరిగి తమ వద్దకు చేర్చాలని నసీం బేగం కోరింది.

Latest Updates