మానవత్వం చాటుకున్న పోలీసులు

వైజాగ్ : వి.మాడుగుల రూరల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. వి.మాడుగుల మండలం శంకరం గ్రామంలోని చుట్టుగెడ్డలో ఓ నిండు గర్భణికి పురిటినొప్పులు రావడంతో గ్రామస్థులు 108కి కాల్ చేశారు. అయితే ఆ ఊరికి రోడ్డు సరిగ్గాలేదని 108 రావడానికి వీలు కాదని తెలిపారు సిబ్బంది.

మహిళ భరించలేని నొప్పితో బాధపడుతుండటంతో..పోలీసులకు సమాచారం అందించారు స్ధానికులు. వెంటనే పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని గర్భిణిని తమ జీపులో ఎక్కించుకుని క్షేమంగా హస్పిటల్ కు తరలించి అడ్మిట్ చేశారు. పోలీసులు చేసిన మంచి పనికి గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.

 

Latest Updates