సోకుల కోసం సెక్రటేరియట్ కు వందల కోట్లా: రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు ఎంపీ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నమోదు కేసులు ఎక్కువ అవుతుంటే… పేదల కోసం నిధులు ఖర్చు చేయలేదు కానీ, సోకుల కోసం సెక్రటేరియట్ కు వందల కోట్లా? అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. సెక్రటేరియట్ నిర్మాణానికి రూ.400 కోట్లు విడుదల అంటూ మీడియాలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను కూడా రేవంత్ రెడ్డి తన ట్వీట్ కు జోడించారు.

సచివాలయ కూల్చివేతను పరిశీలించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద విచారణకు స్వీకరించింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ(శుక్రవారం) కానీ, సోమవారం కానీ విచారణ జరగొచ్చని భావిస్తున్నారు. సచివాలయం జి బ్లాక్ లో గుప్తనిధులపై ఆరోపణలు చేస్తున్న రేవంత్, సచివాలయం కూల్చివేత సందర్భంగా అసలేం జరుగుతోందో తమకు పరిశీలించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు.

Latest Updates