తలైవా పార్టీ పెట్టాలంటూ ఫ్యాన్స్ గగ్గోలు

చెన్నై: రాజకీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయాన్ని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విరమించుకున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటానని, సేవా కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనికి ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. రజనీ పొలిటికల్ పార్టీ పెట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మేరకు చెన్నైలోని వెల్లువర్ కొట్టామ్‌‌లో వందలాది మంది రజనీ అభిమానులు గుమిగూడారు. రాజకీయాల నుంచి నిష్క్రమించొద్దని తలైవాను కోరుతూ నినాదాలు చేశారు.

Latest Updates