40 మంది బోన్సర్స్ తో పెళ్లి కొడుకు హంగామా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పెళ్లి ఎప్పటికీ గుర్తుండేలా గ్రాండ్ గా చేసుకోవడం కామన్ అనుకున్నాడేమో. తన పెళ్లి ఓ హాట్ టాపిక్ కావాలనుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన చుట్టు 40 మంది బోన్సర్స్ ని పెట్టి పెళ్లి చేసుకున్నాడు. టేకులపల్లి మండలంలోని సింగ్యతాండకు చెందిన బాణోత్ పుల్సింగ్ కుమారుడు రవితేజ.. ములుగుకు చెందిన అమ్మాయితో వివాహం నేడు జరిగింది.

అయితే రవితేజ తన వివాహం సెలబ్రెటీలు చేసుకున్నట్టు చేసుకున్నాడు. కల్యాణ మండపంలో 40 మంది బొన్సర్స్ తో హంగామా చేశాడు. వాహనం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్న భరత్.. మండపానికి ప్రత్యేకంగా రాజమండ్రి నుండి పూలు తెప్పించుకున్నాడు. ఇలా పెళ్లిలో అన్ని ప్రత్యేకంగా ఉండేలా చేసి న్యూస్ లో నిలిచాడు.

 

Latest Updates