అడవి అలుగుకు కోటిన్నర బేరం

8 మంది అరెస్టు.. ఒకరి పరారీ

మంచిర్యాల, వెలుగు: అడవి అలుగును వేటాడి కోటిన్నరకు అమ్మే ప్రయత్నం చేస్తున్న వేటగాళ్లను టాస్క్​ఫోర్స్​పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. టాస్క్​ఫోర్స్​సీఐ కిరణ్​​ కుమార్​తెలిపిన వివరాల ప్రకారం.. క్యాన్సర్​వ్యాధుల మెడిసిన్​లో అలుగు పొలుసు వాడతారని, చైనా మార్కెట్​లో భారీ ధర పలుకుతుందన్న ప్రచారంతో 9 మంది కాసిపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సండ్రపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో వేటకు వెళ్లారు. అడవి అలుగును వేటాడి అమ్మే ప్రయత్నం చేస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి, సిబ్బంది 8 మందిని పట్టుకున్నారు. వేటగాళ్ల నుంచి అడవి అలుగుతో పాటు మూడు బైక్​లు, 8 సెల్​ఫోన్స్, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Latest Updates