ఈ ఏడాది టాప్ ఆఫర్లు ఇవే..కారు కొనడానికి ఇదే టైమ్

న్యూఢిల్లీ: కార్ల తయారి కంపెనీలు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మారుతి ‘బెస్ట్​ ఆఫర్ ఆఫ్ది ఇయర్’ అంటుంటే, టాటా మోటర్స్ ‘బెస్ట్ ఇన్​డికేడ్’, హ్యుండయ్ ఇండియా ‘డిసెంబర్ డిలైట్’అంటూ ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా భారత్స్టేజ్(బీఎస్–4) 4 స్టాకులను తొందరగా వదిలించుకునేందుకు డిసెంబర్‌‌‌‌లో ఈ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ ఆఫర్ల రేంజ్ 5 శాతంనుంచి 15 శాతంగా ఉంది. వచ్చే జనవరి నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రధాన ఆటోమొబైల్‌‌ కంపెనీలు ఇప్పటికే ప్రకటనలు చేశాయి . ఈ నేపథ్యంలో, కార్లను కొనడానికి ఇదే మంచి టైమని పరిశ్రమ వర్గాలు ఊరిస్తున్నాయి. “ సుమారుగా మాబీఎస్​4 కార్లన్నింటిని అమ్మేశాం. కొన్ని మోడల్స్‌‌పై డిస్కౌంట్‌‌లు అధికంగా ఇస్తున్నాం . ఈ డిస్కౌంట్లు తక్కువ కాలమే ఉంటాయి. సేఫ్టీ, ఎమిషన్‌ నిబంధనలు, కరెన్సీ కదలిక వంటి అంశాల వలన వచ్చే జనవరి నుంచి ధరలు అధికంగా ఉంటాయి”అని మారుతి సుజుకీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్ డైరక్టర్ శశాంక్​ శ్రీవాస్తవ అన్నారు.

మారుతి సుజుకీ రూ. 37,000–89,000 వరకుడిస్కౌంట్‌‌ను ఇస్తోంది. తక్కువగా ఈకో మోడల్‌‌కు ఇస్తుండగా, అధికంగా విటారా బ్రెజ్జాపై ఇస్తోంది. హ్యుండయ్ తన మోడల్స్ ఎలంట్రా, టస్కన్‌ పైరూ. 20,000 నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్‌‌ను ప్రకటించింది. టాటా మోటర్స్ తనహ్యచ్‌ బ్యాక్‌ల పై రూ.77,500 వరకు, హెక్సాపైరూ.2.25 లక్షల వరకు డిస్కౌంట్‌‌నిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న ఆఫర్లు ఈ ఏడాదిలోనే అధికమని హ్యుండయ్ ఇండియా, నేషనల్ సేల్ హెడ్ వికాస్​ జైన్​ అన్నారు. ఈ ఆఫర్ల వలన డిసెంబర్ నెలలోవాహనాల అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు . మరోవైపు కొనుగోలుదారులు మాత్రంబీఎస్‌ 6 రానున్న నేపథ్యంలో కార్ల ధరలు ఇంకా తగ్గుతాయని ఆశిస్తున్నారు. స్టాక్స్‌‌ మొత్తం వదిలించుకోవడం కంపెనీలకు తప్పనిసరి కాబట్టి, చివరిదాకా వేచి చూద్దామనే ఆలోచనే వారిలో కనబడుతోంది. కాకపోతే, నెలల తరబడి అమ్మకాలు లేనిఆటోమొబైల్‌‌ కంపెనీలు మాత్రం ఏదో రకంగాకస్టమర్లను కన్విన్స్‌‌ చేయాలని ప్రయత్ని స్తున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్‌‌ నుంచి బీఎస్​6 నిబంధనలుతప్పనిసరి కానున్నాయి.

Latest Updates