అనుమానంతో భార్యను కత్తితో చంపిన భర్త

విశాఖపట్నంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను కత్తితో చంపేసాడు ఓ భర్త. ఈ ఘటన శుక్రవారం రాత్రి కొత్తపాలెం సమీపంలో ఉన్న నాగేంద్ర కాలనీలో జరిగింది. ఎద్దు పైడిరాజు తన భార్య శారదతో కలిసి ఉంటున్నాడు. భార్య శారద వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని రోజు అనుమానించేవాడు..వేధించేవాడు. శుక్రవారం ఇదే విషయంపై ఇద్దరి మద్య మరోసారి గొడవ జరిగింది.  దీంతో సహనం కోల్పోయిన  పైడిరాజు భార్యపై కత్తితో దాడి చేశాడు. భార్య శారద అక్కడిక్కడే చనిపోయిందని తెలుసుకున్నపైడిరాజు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీలసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates