నువ్వు లేక నేనుండలేను- భార్య కోసం భ‌ర్త సూసైడ్

చెప్పకుండా ఆస్ట్రేలియా వెళ్లిన భార్య
రమ్మని అడిగినా రాలే
గడ్డిమందు తాగి భర్త ఆత్మహత్య‌

కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్ రూ రల్ మండలం బొమ్మకల్కు చెంది న వెంగళదాసు రఘురామ్(39) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం…బొమ్మక ల్కు చెందిన రఘురామ్ కు మూడేండ్ల కింద సరితతో పెండ్లయ్యింది. కొన్ని కారణాల వల్ల ఏడాదిన్నర కింద ఆమె భర్తకు చెప్పకుండా ఆస్ట్రేలియా వెళ్లింది. దీంతో ఆమెను వెతుకుతూ రఘురామ్ కూడా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఎలాగో కష్టపడి ఆమె నంబర్ సంపాదించి ఫోన్ చేశాడు. అడ్రస్ చెప్పమని అడగ్గా తనకు వచ్చే ఉద్దేశం లేదని…తిరిగి ఇండియాకు వెళ్లిపొమ్మ‌ని చెప్పింది.

దీంతో ఇక్కడికి వచ్చిన రఘురామ్ అప్పటి నుంచి బాధతోనే ఉంటున్నాడు. సరిత లేకుండా ఉండలేనని ఈనెల 24న ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు చెలిమెడ హాస్పిటల్ కు తరలించగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆదివారం చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Latest Updates