భార్య చనిపోయిన కాసేపటికే భర్త సూసైడ్

భార్య చనిపోయిన కాసేపటికే భర్త సూసైడ్ చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లోని పంజాగుట్టలో జరిగింది. పంజాగుట్టలోని బీఎస్ మక్తా హరీ గేట్ లో దంపతులు నివసిస్తున్నారు. వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో భార్య చనిపోయిన కాసేపటికే భర్త అదే ఇంటిపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ కూడా రాశారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

For More News..

24 గంటల్లో 37,148 పాజిటివ్ కేసులు

టెస్టు చేయకుండానే కరోనా పాజిటివ్ గా తేల్చిన వైద్య సిబ్బంది!

మద్యం దుకాణాలు, బ్యాంకులు కూడా మూయాల్సిందే

Latest Updates