భార్యమీద కోపంతో పిల్లలకు విషం

ఒకరు మృతి, మరొకరు సీరియస్

మేడ్చల్ : భార్య మీదున్న కోపంతో తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి ఆపై తాను కూడా తాగి ఓ తండ్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శనివారం మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో చిన్న కొడుకు ప్రవీణ్(4) చనిపోగా.. పెద్ద కొడుకు ప్రదీప్(6)ను హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ కు తరలించారు. తండ్రి సురేష్ కు గాంధీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.  మేడ్చల్ జిల్లా రాజబొల్లారం తండాకు చెందిన సురేష్.. మందుకు బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి మందు తాగి భార్య మంజులతో గొడవ పడటంతో ఆమె.. అదే ఊళ్లోని తల్లిగారింటికి వెళ్లింది. సురేష్ ఇంట్లో ఉన్న పురుగుల మందును కూల్ డ్రింక్ లో కలిపి తన ఇద్దరు పిల్లలకు తాగించి.. ఆపై తాను తాగాడు. పిల్లల ఏడుపులు విని బయటికి వచ్చిన మంజుల.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్న కొడుకు ప్రవీణ్ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ప్రదీప్ కండిషన్ సీరియస్ గా ఉండటంతో నీలోఫర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సురేష్ ను గాంధీకి తరలించారు.

Latest Updates