కామారెడ్డి జిల్లాలో భార్యను వేధిస్తున్న భర్తకు దేహశుద్ధి

కామారెడ్డి జిల్లా :  భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు బంధువులు. ఈ సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. రామారెడ్డి మండలం, రెడ్డిపేట్ గ్రామానికి చెందిన నర్సింహులుకు లావణ్యతో 20 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. అప్పటి నుంచి భార్య లావణ్యను నర్సింహులు వేధిస్తున్నాడని లావణ్య బంధువులు చెబుతున్నారు. 20 సంవత్సరాలుగా మానసికంగా, శారీరకంగా లావణ్యను  వేధిస్తున్నాడని ..భర్త  వేధింపులు తట్టుకోలేక పది రోజుల క్రితం లావణ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు.

అయినా సరే నర్సింహులుకు మార్పు రాకపోవడంతో రెండ్రోజులుగా మళ్లీ వేధిస్తున్నాడని తెలుసుకున్న లావణ్య బంధువులు బుధవారం అతడికి దేవశుద్ధి చేశారు. తర్వాత ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు లావణ్య బంధువులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

 

 

Latest Updates