భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

మెహిదీపట్నం, వెలుగు: భర్త వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఆసిఫ్ నగర్ దత్తాత్రేయ నగర్ కు చెందిన సతీష్​కు ఎనిమిదేళ్ల క్రితం ప్రియాంకతో పెండ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సతీష్​పాల వ్యా పారం చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. నిత్యం సతీష్​ భార్య ప్రియాంకను వేధించేవాడు. దీంతో గతంలోనే సతీష్​పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరువురి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో కొద్ది రోజులు సంసారం సాఫీగానే సాగింది. కానీ, మళ్లీ కొన్నాళ్లుగా వేధింపులు ఎక్కువయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ప్రియాంక ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త సతీష్​వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Latest Updates