భార్యను చంపి.. మూటకట్టి పడేసిన భర్త

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఎస్ కాలనీలో శేఖర్, స్రవంతి అనే దంపతులు నివాసముంటున్నారు. ఏమైందో ఏమో కానీ.. స్రవంతిని తలపై కొట్టి, చున్నీతో మెడకు బిగించి శేఖర్ హత్య చేశాడు. ఆ తర్వాత స్రవంతి మృతదేహాన్ని తమ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో మూటకట్టి పడేసి పరారయ్యాడు. మంగళవారం రాత్రి స్థానికులు మూటను గమనించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భర్త శేఖర్ కోసం గాలింపు చేపట్టారు.

For More News..

యువతి కడుపులో 2.5 కేజీల వెంట్రుకల బంతి

బ్రెయిన్ షార్ప్‌‌గా ఉండాలంటే రోజూ ఇవి తినండి

కొత్తగా 3 వేల స్టేట్‌‌‌‌బ్యాంక్ ఏటీఎంలు

Latest Updates