అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

Husband kills wife in kurnool District

అనుమానంతో కట్టకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త.  ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లా బనగానపల్లే మండలంలోని  టంగుటూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి, ఏలేశ్వరి దంపతులు. ప్రసాద్ రెడ్డి పెళ్లిళ్లకు షామియానా సరఫరా చేస్తూ, ఓ ఫోటో స్టూడియోని కూడా నిర్వహిస్తున్నాడు.

కారణాలు తెలియదు కానీ అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో అనుమానాలు , ఫలితంగా మనస్పర్ధలు, గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో తాగుడుకు బానిసైన ప్రసాద్ రెడ్డి..  బుధవారం వేకువజామున ఇంట్లో  నిద్రిస్తున్న భార్య మల్లేశ్వరి పై రోకలిబండ తీసుకొని తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ప్రసాద్ రెడ్డి అక్కడ్నుంచి పారిపోయాడు.  రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి  భయాందోళనకు గురైన వారి పిల్లలు చుట్టు పక్కల వారికి తెలిపారు.   స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న నందివర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు

Latest Updates