భార్యను కత్తితో పొడిచి చంపి.. లొంగిపోయిన భర్త

హైదరాబాద్: హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త చేతిలో భార్య ప్రాణాలు కోల్పోయింది. మంగార్ బస్తీలో నివసిస్తున్న సలీమ్  అనే వ్యక్తి తన మొదటి భార్య తహీరా(35)ను కత్తితో పొడిచి చంపాడు. బుధవారం ఉదయం వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో..కోపం పట్టలేని సలీమ్ తన భార్యపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. తన భార్య చనిపోయిందని తెలుసుకున్న సలీమ్.. అనంతరం హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కి తాను చేసిన నేరాన్ని ఒప్పుకొని పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తహీరా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

husband-murder-his-first-wife-in-habeebnagar-police-station-limits

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates