భార్యపై అనుమానం : పసివాడిని చంపిన తండ్రి

ప్రకాశం జిల్లా : భార్యపై అనుమానంతో 8 నెలల కొడుకుని కొట్టిచంపాడు తండ్రి. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. రాచర్ల మండలానికి చెందిన చిన్న పుల్లయ్య భార్యను నిత్యం అనుమానించేవాడు. శుక్రవారం రాత్రి కూడా గొడవ జరిగింది. దీంతో కన్న తండ్రే కసాయిలా మారాడు భార్యమీద కోపంతో 8 నెలలకొడుకుని నేలకేసి కొట్టి చంపాడు.  ఆ తర్వాత భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్యకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చిన్నపుల్లయ్య.. గతంలో మొదటి భార్యను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమెను చంపిన కేసులో 8ఏళ్లు జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్నపుల్లయ్య పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు. పసివాడిని చంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ చిన్నారి ఏ పాపం చేశాడని కన్నీరుమున్నీరుగా విలపించారు.

Latest Updates