మహిళను ఈడ్చిపడేసిన సూపరింటెండెంట్ భర్త

husband-of-the-superintendent-misbehaved-with-a-cleaner-at-barwani-kanya-ashram

ఛత్తీస్ గఢ్ లో జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొరియా జిల్లా జనక్ పూర్ లోని ప్రభుత్వ వసతి గృహంలో తన మూడు నెలల పసి బిడ్డతో ఆశ్రయం పొందుతోంది ఓ మహిళ. ఆమె ఇక్కడే ఆయాగా పనిచేస్తోంది. వసతి గృహం సూపరింటెండెంట్ సుమీలా సింగ్ భర్త వసతి గృహానికి వచ్చి ఆ మహిళతో గొడవ పెట్టుకొని, ఆమెను దారుణంగా తిడుతూ, మంచం మీది నుంచి కింద పడేసి బయటకు ఈడ్చుకెళ్లాడు.

సుమీలా సింగ్‌ అనే మహిళ జనక్‌పూర్‌బ్లాక్‌లోని బర్వాని కన్యా ఆశ్రమానికి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. సుమీలా సింగ్‌ భర్త రంగ్‌లాల్‌ సింగ్‌ వసతి గృహానికి వెళ్లి ఆయాతో వాగ్వాదానికి దిగాడు. ఆమెను వసతిగృహంలో ఎందుకు ఉంటున్నావని నిలదీశాడు. మహిళ అని కూడా చూడకుండా రంగ్‌లాల్‌ ఆమెను దూషిస్తూ, మంచం మీద నుంచి కింద పడేసి దారుణంగా ఈడ్చుకెళ్లాడు. ఇంత జరుగుతున్నా వసతిగృహ సూపరింటెండెంట్‌ పక్కనే ఉండి కూడా భర్తను వారించలేదు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యభర్తలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కానీ సుమీలా సింగ్ భర్తను వారించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఇంకా అరెస్టు చేయలేదు. విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, అధికార పార్టీ నాయకులు బాధితురాలిని పరామర్శించారు.

Latest Updates