రోకలి బండతో భార్యను చంపిన భర్త

కుటుంబ తగాదాలతో భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన విజయవాడ రూరల్‌ మండలంలో జరిగింది. మరో వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందనే కోపంతో భార్యను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. నిడమానూరు రామ్‌నగర్‌కు చెందిన సోమేలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అతడికి భార్య అశ్విని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అశ్విని మరొకరితో సన్నిహితంగా ఉంటుందంటూ గత కొద్దిరోజులుగా సోమేలు,అశ్వినితో గొడవ పడతున్నాడు.

ఇదే విషయంపై గతరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సోమేలు ఇవాళ (శనివారం) ఉదయం తిరిగి ఇంటికి వచ్చాడు. తలుపు తీసిన భార్యను చూడగానే కోపంతో రోకలి బండతో తలపై బలంగా కొట్టాడు. దీంతో అశ్విని అక్కడిక్కడే చనిపోయింది. తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన సోమేలు… భార్య మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను పోలీసులకు అందచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.

Latest Updates