రెవెన్యూ డివిజన్‌‌గా హుజూర్‌‌నగర్‌‌

    ప్రిలిమినరీ నోటిఫికేషన్‌‌ జారీ చేసిన ప్రభుత్వం

    ఎన్నికల హామీని నెరవేర్చిన సీఎం కేసీఆర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: సూర్యాపేట జిల్లాలో హుజూర్‌‌నగర్‌‌ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. జిల్లాలో ప్రస్తుతం కోదాడ, సూర్యాపేట రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఉప ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థిని గెలిపిస్తే హుజూర్‌‌నగర్‌‌ను రెవెన్యూ డివిజన్‌‌గా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆ హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఈ క్రమంలోనే హుజూర్ నగర్ ను  రెవెన్యూ డివిజన్‌‌గా ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌‌ ఇచ్చారు. సూర్యాపేట రెవెన్యూ డివిజన్‌‌లోని నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, కోదాడ రెవెన్యూ డివిజన్‌‌లోని హుజూర్‌‌నగర్‌‌, మఠంపల్లి, చింతలపాలెం, మేళ్లచెరువు మండలాలతో కొత్త డివిజన్‌‌ను ప్రతిపాదించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత, వాటికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి తుది నోటిఫికేషన్‌‌ జారీ చేస్తారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates