ముగిసిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం

హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇవాళ చివరి రోజు కావడంతో జోరుగా ప్రచారం చేశారు నేతలు, అభ్యర్థులు. ఈ నెల 21వ తేదీన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. 24వ తేదీన కౌంటింగ్‌ జరుగుతుంది. అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నారు.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజక వర్గాలకు, హర్యానాలో 90 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎలక్షన్‌ కమిషన్‌ ఈ నెల 21న ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధించింది. దీనికి  సంబంధించి  ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Latest Updates